దర్శకధీరుడు రాజమౌళి తన సినీ జీవితంలో అత్యధిక భారీ బడ్జెట్ తో తెరపైకి తీసుకువచ్చిన ఆర్ఆర్ఆర్ సినిమాను ఈ సంక్రాంతికి ఎలాగైనా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని అనుకున్నారు. ఎంతో ఓపికతో హీరోలు ఇద్దరిని తీసుకొని దాదాపు అన్ని భాషల్లోనూ కూడా ప్రమోషన్స్ గట్టిగానే చేశాడు. సినిమాకు పోటీగా పెద్ద సినిమాలు ఉండకూడదు అని హీరోలను బ్రతిమాలి మరి వారి సినిమాలను వాయిదా వేసుకునేలా చేసాడు. ఇక మొదట మహేష్ బాబు సర్కారు వారి పాట సినిమాను పోటీ నుంచి తప్పించిన విషయం తెలిసిందే.
అందుకోసం మహేష్ బాబుతో జక్కన్న చాలా చర్చలు జరపాల్సి వచ్చింది. అయితే ఇప్పుడు ఆర్ఆర్ఆర్ ఏప్రిల్ లో వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఆ సమయంలో కూడా మహేష్ బాబు సర్కారు పాట విడుదల కానుంది. పరిస్థితిలో అనుకూలిస్తే ఏప్రిల్ మొదటి వారంలోనే వచ్చే అవకాశం ఉంటుంది. ఇక ఏప్రిల్ ఒకటో తేదీన సర్కారు వారి పాట రాబోతున్న విషయం తెలిసిందే. ఇక మళ్లీ ఆ సమయంలో రాజమౌళి మహేష్ బాబు తో మాట్లాడే అవకాశం ఉందా లేదా అనే విషయంలో అనేక రకాల సందేహాలు వస్తున్నాయి.
కానీ మరోసారి మాత్రం రాజమౌళి అడిగే ఛాన్స్ అయితే ఉండదు. ఎందుకంటే రాజమౌళికి తన సినిమా ఎంత ముఖ్యమో మిగతా వారికి కూడా అంతే ముఖ్యం. పరిస్థితులు బాగున్నప్పుడే సినిమాను విడుదల చేసుకోవాలని అనుకుంటారు. మరి ఆర్ఆర్ఆర్ సినిమా ఎలాంటి ఒడిదుడుకులలో ఎదుర్కొంటుందో చూడాలి. ఇక భీమ్లా నాయక్ సినిమా కూడా సంక్రాంతి నుంచి తప్పుకోవడానికి రాజమౌళి ఒక కారణం అని చెప్పాలి. ఒకవేళ సంక్రాంతిని రావాలని ఫిక్స్ అయితే ఈ చిత్ర యూనిట్ సభ్యులు ఇప్పటికే అన్ని పనులు పూర్తిచేసి విడుదల చేసేందుకు సిద్ధంగా ఉండేవారు.
ఏదేమైనా కూడా ఆర్ఆర్ఆర్ సినిమా భవిష్యత్తులో విడుదల డేట్ ఫిక్స్ చేసుకున్నప్పటికీ కూడా మరోసారి మిగతా సినిమాల నిర్మాతలతో హీరోలతో మాత్రం చర్చలు జరిపే అవకాశం లేకపోలేదు.