దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి గురించి కేవలం మన తెలుగు ఇండస్ట్రీ లోనే కాకుండా ప్రస్తుతం టాలీవుడ్ నుండి మొదలు పెడితే బాలీవుడ్, హాలీవుడ్ వరకు ఆయన ఏంటో ప్రతి ఒక్కరికి తెలిసింది.. వెండి తెరకు ఎన్టీఆర్ హీరోగా నటించిన స్టూడెంట్ నెంబర్ వన్ చిత్రానికి డైరెక్టర్ గా ఎంట్రీ ఇచ్చి తన మొదటి చిత్రంతోనే సూపర్ డూపర్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక ఆ చిత్రంతో మొదలు రాజమౌళి విజయ యాత్ర నేటి ఆర్ ఆర్ ఆర్ వరకు కొనసాగుతూనే ఉన్నది.
అలా రాజమౌళి తన రెండున్నర దశాబ్దాల సుధీర్గ సినీ కెరియర్ లో మొత్తం పదమూడు చిత్రాలను నిర్మించగా వాటిలో ఏ ఒక్క సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది లేదు. దాంతో మన టాలీవుడ్ లో అపజయమేరుగని దర్శకుడు ఎవరంటే దర్శక ధీరుడు గా పేరుగాంచిన ఏకైక దర్శకుడు రాజమౌళి ఒక పేరే చెబుతారు. ఇక ఆర్ ఆర్ ఆర్ చిత్రం తర్వాత రాజమౌళి కి ఇంటర్నేషనల్ పరంగా చాలా పాపులారిటీ ని కైవసం చేసుకున్నాడు. తాను తీసే మేకింగ్ స్కిల్స్ తో హాలీవుడ్ ఫిల్మేకర్స్ సైతం అబ్బురపడేలా చేయగలిగాడు.
ఇన్నేళ్ల సినీ ప్రయాణంలో రాజమౌళి ఏదైనా చిత్రం మొదలెట్టాడు అంటే అది ఆగే ఆలోచన ఉండనే ఉండదు.. లేట్ అవ్వోచ్చేమో కానీ పక్క ప్రాజెక్ట్ మాత్రం పూర్తిచేసే తీరతాడు రాజమౌళి.. మరి అలాంటి రాజమౌళి కెరియర్ లో చాలామందికి తెలియని ఒక విషయం ఉంది. అదేంటంటే.. తను కెరియర్ మొదట్లో రాజమౌళి ప్రారంభించిన రెండు పెద్ద చిత్రాలు మధ్యలోనే నిలిచిపోయాయట.. స్టూడెంట్ నెంబర్ వన్ చిత్రం సూపర్ హిట్ తర్వాత రాజమౌళి తన తదుపరి చిత్రం మలయాళ స్టార్ మోహన్ లాల్ హీరోగా ఓ మైథిలాజికల్ డ్రామా తెరకెక్కించాలనుకున్నాడు.
అయితే అంతా ఓకే అనుకొని అన్నిటికీ రంగం సిద్ధం అయ్యాక ఏమైందో తెలియదు ఈ మూవీ మధ్యలోనే ఆగిపోయింది. ఇక ఈ చిత్రం తర్వాత దర్శకేంద్రుడు కే రాఘవేంద్రరావు తనయుడు సూర్య ప్రకాష్ తో కూడా ఓ భారీ చిత్రం ప్లాన్ చేశాడు రాజమౌళి. కానీ సూర్య ప్రకాష్ అప్పటికే నటించిన డెబ్యూ చిత్రం నీతో డిజాస్టర్ అవడంతో రాజమౌళి ముందు జాగ్రత్తతో వెనక్కి తగ్గాడు.. అలా తన కెరీర్లో రెండు పెద్ద సినిమాలు ఇలా మధ్యలోనే బ్రేక్ అయ్యాయి..