బాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోయిన్ సుస్మితా సేన్ సోదరుడు రాజీవ్ సేన్ చిక్కుల్లో పడ్డాడు.. ప్రేమించి పెళ్లిచేసుకున్న భార్యను పలు రకాలుగా చిత్రహింసలకు గురి చేస్తూ.. రాజీ కుదుర్చుకుని విడాకులు వెనక్కి తీసుకున్న తర్వాత కూడా మళ్లీ భార్యను ఇబ్బందులపాలు చేస్తుండడంతో ఆమె మీడియా ముందుకొచ్చింది.. వివరాల్లోకి వెళ్తే.. బాలీవుడ్‌లో పలు సీరియల్స్‌లో నటించి గుర్తింపు తెచ్చుకున్ననటి చారు అసోపా.. సుస్మితా సేన్ సోదరుడు రాజీవ్ సేన్‌ని లవ్ మ్యారేజ్ చేసుకుంది.
కట్ చేస్తే, పెళ్లైన ఏడాదికే మేం విడిపోతున్నాం అని ప్రకటించారు. పెద్దల జోక్యంతో ఇద్దరూ కూర్చుని మాట్లాడుకుని కలిసుండాలి డిసైడ్ అయ్యారు. ఇదే విషయాన్ని మీడియా సాక్షిగా చెప్పారు. తమ పాప కోసమే కలిసుండాలనుకుంటున్నామని అన్నారు. ఇప్పుడు మరో ట్విస్ట్ ఇచ్చారు.. మళ్లీ కలిసి రెండు నెలలు కూడా అవలేదు.. ఈసారి పూర్తిగా విడిపోవాలని ఫిక్సైపోయారు. దీంతో ఈ సెలబ్రిటీ కపుల్ విడాకుల వ్యవహారం మరోసారి బాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. వీరికి జియానా అనే 11 నెలల కూతురు ఉంది.
మరోసారి విడాకుల వ్యవహారం తెరపైకి రావడం గురించి ఓ యూట్యూబ్ ఛానల్ ప్రశ్నించగా.. ఆ ఇంటర్వూలో చారు అసోపా తమ వైవాహిక జీవితం గురించి పలు ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చింది.‘‘పెళ్లి జరిగినప్పటి నుండి రాజీవ్ నన్ను ఇబ్బంది పెడుతూనే ఉన్నాడు. తరచూ మా మధ్య గొడవలు జరుగుతూనే ఉన్నాయి. దీంతో మానసికంగా కృంగిపోయాను. గొడవ జరిగిన ప్రతిసారీ నన్ను వదిలి వెళ్లిపోయేవాడు. కరోనా టైంలో కూడా మూడు నెలల దూరంగా ఉన్నాడు. నా ఫోన్ నంబర్లు బ్లాక్ చేశాడు. దీంతో ఆ బాధ నుంచి బయటపడటానికి మళ్లీ పని మీద దృష్టి పెట్టాను.
‘అక్బర్ కా బల్ బీర్బల్’ షూటింగ్‌కి అటెండ్ అయిన కొన్నిరోజులకే రాజీవ్ తిరిగొచ్చాడు. నా పని విషయంలో జోక్యం చేసుకున్నాడు. తోటీ నటీనటులందరికీ నా గురించి మెసేజ్‌లు పెట్టి బెదిరించాడు. దీంతో నన్ను షో నుంచి తీసేశారు. విడాకుల కోసం అప్లయ్ చేస్తే.. బాగా చూసుకుంటానని మాటిచ్చాడు. సరేలే అని డైవోర్స్ వెనక్కి తీసుకున్నాను. అయినా రాజీవ్ తీరు మారలేదు. మళ్లీ వేధించడం స్టార్ట్ చేశాడు. అందుకే ఇప్పుడు అతడితో శాశ్వతంగా విడిపోవాలని నిర్ణయించుకున్నాను’’ అంటూ కన్నీరు పెట్టుకుంది చారు అసోపా..