Rajinikanth, Suriya: ‘పెద్దన్న’ బయ్యర్స్ కోసం ‘ఈటి’.. వర్కౌట్ అవుతుందా..!

సూర్య హీరోగా ఈటి (ఎవ్వరికీ త‌ల‌వంచ‌డు) అనే చిత్రం రూపొందింది. పాండిరాజ్ దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీని ‘సన్ పిక్చర్స్’ పతాకం పై కళానిధి మారన్ నిర్మించారు. టాలీవుడ్ కు చెందిన ప్రముఖ ప్రొడక్షన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ సంస్థ ‘ఏషియన్ మల్టీప్లెక్స్ ప్రైవేట్ లిమిటెడ్’ వారు ఈ చిత్రం తెలుగు వెర్షన్‌ను విడుదల చేయబోతున్నారు. తమిళ తో పాటు తెలుగులోనూ ఈ చిత్రం మార్చి 10న విడుదల కాబోతుంది.

Click Here To Watch Now

ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్ వంటివి సినిమా పై మంచి బజ్ ఏర్పడేలా చేసాయి. ‘ఆకాశం నీ హద్దురా’ ‘జై భీమ్’ వంటి ఓటిటి హిట్లతో సూర్య ఫామ్లో ఉన్నాడు కాబట్టి.. థియేటర్లలో విడుదలవుతున్న ఈ చిత్రం మంచి విజయం సాధిస్తుందని చిత్ర బృందం ఆశాభావం వ్యక్తం చేస్తుంది. ఇదిలా ఉంటే.. గతేడాది చివర్లో ‘సన్ పిక్చర్స్’ పతాకం పై కళానిధి మారన్ నిర్మాణంలో రజినీ కాంత్ ‘పెద్దన్న’ సినిమా విడుదలైన సంగతి తెలిసిందే.

తమిళంలో ఈ చిత్రం లాభాలను అందించినప్పటికీ తెలుగులో మాత్రం నష్టాలనే మిగిల్చింది. తెలుగు బయ్యర్స్ కు ఈ చిత్రం రూ.7 కోట్ల పైనే నష్టాలను మిగిల్చింది.అందుకు నష్టపరిహారంగా వాళ్లకి ‘ఈటి’ చిత్రం హక్కుల్ని ఇస్తున్నారని వినికిడి. అయితే కొన్ని ఏరియాలకు మాత్రమే అలా. వాళ్ళ నష్టాలు తీరాలి అంటే ‘ఈటి’ రూ.7 కోట్ల వరకు గ్రాస్ ను రాబట్టలట. ఈ విషయం పై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

అయితే ‘రాధే శ్యామ్’ ఉండగా తెలుగులో ‘ఈటి’ ని ప్రేక్షకులు పట్టించుకుంటారా అనేది ఒక ప్రశ్న అయితే సూర్య మార్కెట్ తెలుగులో డల్ అయిన తరుణంలో అంత మొత్తం రాబడుతుందా? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న.

బిగ్ బాస్ నాన్ స్టాప్ 17మంది కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!

Most Recommended Video

‘భీమ్లా నాయక్’ లోని అదిరిపోయే డైలాగులు ఇవే..!
సెలబ్రిటీ కపుల్స్ నయా ట్రెండ్.. ‘సరోగసీ’..!
చైసామ్, ధనుష్- ఐస్ లు మాత్రమే కాదు సెలబ్రిటీల విడాకుల లిస్ట్ ఇంకా ఉంది..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus