“ఆ దేవుడు శాసించాడు.. ఈ రజనీకాంత్ పాటిస్తున్నాడు. నేను రాజకీయాల్లోకి రావడం దైవేచ్చ” అంటూ తన రజకీయ ఆరంగేట్రాన్ని ప్రకటించిన సభలో పేర్కొన్న రజనీకాంత్.. తన రాజకీయ తెరంగేట్రాన్ని ప్రకటించి రెండేళ్లు కావస్తున్నా ఇప్పటివరకూ తాను స్వయంగా రాజకీయ పార్టీ పెట్టుకొంటాడా లేక ఏదైనా వేరే పార్టీలో జాయిన్ అవుతాడా అనే విషయాన్ని మాత్రం స్పష్టం చేయలేదు. పార్టీ గుర్తును కూడా ప్రకటించిన రజనీకాంత్.. పేరు మాత్రం ఇప్పటివరకూ చెప్పలేదు. అసలు రాబోయే ప్రత్యక్ష ఎన్నికల్లో భాగస్వామి అవ్వబోతున్నాడో లేదో కూడా చెప్పలేదు.
అయితే.. ఇవేమీ పట్టనట్లు రజనీకాంత్ చాలా సింపుల్ గా తన తదుపరి చిత్రాన్ని ప్రకటించడం తమిళనాడులో మాత్రమే కాదు సౌత్ ఇండియా వైడ్ గా హాట్ టాపిక్ అయ్యింది. ప్రస్తుతం “దర్బార్” సినిమాతో బిజీగా ఉన్న రజనీకాంత్ తన తదుపరి చిత్రాన్ని శివ దర్శకత్వంలో ప్రకటించాడు. రాజకీయ తెరంగేట్రానికి సన్నద్ధమవుతున్న తరుణంలో ఇలా సినిమాలు ఎనౌన్స్ చేసుకుంటూ వెళ్ళడం అనేది రజనీకాంత్ సినిమాలను ఆరాధించే అభిమానులకు శుభవార్తే అయినప్పటికీ.. ఆయనను ప్రసనల్ గా ఫాలో అవుతున్నవాళ్లందరికీ మాత్రం పెద్దగా నచ్చలేదు. అయితే.. ఈ విషయమై స్పందించిన రజనీ అన్నయ్య “2020లో రజనీకాంత్ తన రాజకీయ పార్టీని ప్రారంభించడం మాత్రమే కాదు.. ఎన్నికల్లోనూ పోటీ చేసేందుకు సిద్ధమవుతారని ప్రకటించడం చర్చనీయాంశం అయ్యింది. ఇదే విషయాన్ని రజనీ కూడా కన్ఫర్మ్ చేస్తే బాగుంటుంది.