స్టార్ హీరో రామ్ చరణ్ కు ప్రేక్షకుల్లో ఉండే క్రేజ్ అంతాఇంతా కాదు. చరణ్ భవిష్యత్తు సినిమాలను పర్ఫెక్ట్ గా ప్లాన్ చేసుకుంటున్నారనే సంగతి తెలిసిందే. చరణ్ నటించిన ఆర్ఆర్ఆర్, ఆచార్య సినిమాలు నెల రోజుల గ్యాప్ లో థియేటర్లలో విడుదల కానున్నాయి. చరణ్ శంకర్ కాంబినేషన్ లో ఒక సినిమా తెరకెక్కుతుండగా ప్రస్తుతం రామ్ చరణ్ ఈ సినిమాపై మాత్రమే దృష్టి పెట్టారనే విషయం తెలిసిందే. ఈ సినిమాతో పాటు చరణ్ గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్ లో ఒక సినిమాకు, సుకుమార్ డైరెక్షన్ లో మరో సినిమాకు ఓకే చెప్పారు.
చరణ్ సుకుమార్ కాంబో మూవీకి సంబంధించి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. అయితే చరణ్ సినిమల ప్లానింగ్ విషయంలో స్టార్ హీరో ప్రభాస్ ను ఫాలో అవుతున్నారని కామెంట్లు వినిపిస్తున్నాయి. బాహుబలి సిరీస్ తో ప్రభాస్ కు క్రేజ్ రాగా ప్రభాస్ ఆ క్రేజ్ ను కాపాడుకుంటూ వరుసగా పాన్ ఇండియా సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ప్రభాస్ భిన్నమైన కథలను ఎంచుకుంటూ ఒక సినిమా కథకు మరో సినిమా కథకు ఏ మాత్రం పోలిక లేకుండా జాగ్రత్త పడుతున్నారు.
చరణ్ సైతం ఒకవైపు స్టార్ డైరెక్టర్లకు మరోవైపు యంగ్ డైరెక్టర్లకు అవకాశాలను ఇస్తూ కెరీర్ ను కొనసాగిస్తూ ఉండటం గమనార్హం. మరోవైపు ప్రాజెక్ట్ కె సినిమాకు, గౌతమ్ చరణ్ కాంబో మూవీకి స్టోరీ విషయంలో కొన్ని పోలికలు ఉన్నాయని వార్తలు ప్రచారంలోకి వస్తున్నాయి. వైరల్ అవుతున్న ఈ వార్తలకు సంబంధించి నిజానిజాలు తెలియాల్సి ఉంది. ఈ రెండు సినిమాలు టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్ తో తెరకెక్కే ఛాన్స్ ఉందనే కామెంట్లు వినిపిస్తున్నాయి.
అయితే చరణ్ గౌతమ్ కాంబో మూవీ యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న నేపథ్యంలో ఈ వార్తల్లో నిజం ఉండకపోవచ్చని కొంతమంది భావిస్తున్నారు. రామ్ చరణ్ భవిష్యత్తు ప్రాజెక్టులన్నీ భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్నాయి.