‘ఆర్.ఆర్.ఆర్’ తర్వాత శంకర్ దర్శకత్వంలో ‘గేమ్ ఛేంజర్’ అనే సినిమా చేస్తున్నాడు రాంచరణ్.సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఈ చిత్రాన్ని దాదాపు రూ.280 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఈ మధ్యనే ఫస్ట్ లుక్ పోస్టర్లు రిలీజ్ అయ్యాయి. వాటికి మంచి స్పందన లభించింది. రాంచరణ్ ఈ పోస్టర్స్ లో యమ స్టైలిష్ గా కనిపించి ఆకట్టుకున్నాడు. అలాగే ఈ సినిమాలో చరణ్ కు సంబంధించి మరో రెండు లుక్స్ కూడా ఉంటాయని తెలుస్తోంది.
ఆర్.ఆర్.ఆర్ చిత్రంలో కూడా (Ram Charan) రాంచరణ్.. మూడు రకాల లుక్స్ తో అభిమానులను ఆకట్టుకున్నాడు. ‘గేమ్ ఛేంజర్’ లో కూడా అదే విధంగా కనువిందు చేయబోతున్నాడు అని స్పష్టమవుతుంది.ఇక ఈ చిత్రం పూర్తయ్యాక బుచ్చిబాబు సాన దర్శకత్వంలో తన 16వ సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు రాంచరణ్. ‘మైత్రి మూవీ మేకర్స్’ వారు ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నాడు. ఇక ఈ చిత్రంలో రాంచరణ్ కంప్లీట్ గా ఉత్తరాంధ్ర స్లాంగ్ లో మాట్లాడతాడట.
అంటే ‘వాల్తేరు వీరయ్య’ లో చిరంజీవిలా అనమాట. సుకుమార్ దర్శకత్వంలో చేసిన ‘రంగస్థలం’ లో కంప్లీట్ గా గోదావరి స్లాంగ్ లో మాట్లాడి మెప్పించాడు చరణ్. ఆ సినిమా చరణ్ కెరీర్లో టర్నింగ్ పాయింట్ గా నిలిచింది. బుచ్చిబాబుతో చేయబోయే సినిమా కథ పై కూడా చరణ్ చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. ఈ సినిమాకి సుకుమార్ స్క్రీన్ ప్లే అందించే అవకాశాలు కనిపిస్తున్నాయని తెలుస్తుంది. ఈ మూవీ కథ చాలా ఇన్స్పిరేషనల్ గా ఉంటుందని టాక్ వినిపిస్తుంది.