అప్పుడెప్పుడో “ఆ ఒక్కటీ అడక్కు” సినిమాతో 1992లో తెలుగు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్ రంభ (Rambha), స్టార్ హీరోయిన్ గా ఎదిగి కృష్ణ, చిరంజీవి (Chiranjeevi), బాలకృష్ణ (Nandamuri Balakrishna), నాగార్జున (Nagarjuna), వెంకటేష్ (Venkatesh), జగపతిబాబు (Jagapathi Babu), జేడీ చక్రవర్తి (J. D. Chakravarthy) వంటి పాపులర్ హీరోలందరితో కలిసి నటించి బీభత్సమైన స్టార్ డమ్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. తెలుగు, తమిళ, మలయాళ, హిందీ, కన్నడ, బెంగాలీ, భోజపురి సినిమాల్లో నటించిన రంభ దాదాపుగా 2011 వరకు సినిమాలు చేస్తూనే ఉంది.
మధ్యలో “యమదొంగ (Yamadonga), దేశముదురు (Desamuduru)” సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ కూడా చేసింది. పెళ్లి చేసుకుని ముగ్గురు పిల్లలు కన్న తర్వాత సినిమాల నుంచి గ్యాప్ తీసుకొని, టీవీకి పరిమితం అయిపోయింది. కొన్ని డ్యాన్స్ షోలు మరియు కామెడీ షోలకు జడ్జ్ గా వ్యవహరిస్తూ వస్తోంది. ఆమెకు తల్లి, వదిన పాత్రలు ఆఫర్ చేసినప్పటికీ.. ఎందుకనో సినిమాలకు దూరంగా ఉంటూ వచ్చింది. అలాంటిది.. మళ్లీ ఇన్నాళ్ల తర్వాత, అది కూడా 50 ఏళ్లకు దగ్గరవుతున్న రంభ మళ్లీ సినిమాల్లో నటించడానికి సిద్ధమంటూ ప్రచారం మొదలుపెట్టింది.
మరి ఇన్నాళ్ల తర్వాత ఆమెను క్యాస్ట్ చేసుకోవడానికి దర్శకనిర్మాతలు ఎంత ఆసక్తి చూపుతారు అనేది చూడాలి. మరి ఈ లేటు వయసులో ఆమెకు ఎలాంటి ఆఫర్లు వస్తాయి అనేది కూడా ప్రశ్నార్ధకం. అయితే.. ఆమెకు 48 ఏళ్లు వచ్చినప్పటికీ మంచి స్ట్రక్చర్ మైంటైన్ చేస్తూ కొత్త హీరోయిన్లకు పోటీ ఇవ్వగలగుతుంది రంభ. 80, 90ల్లో పుట్టినవారికి రంభ పెద్ద క్రష్. సో ఆ జనరేషన్ వాళ్ళందరూ రంభను మళ్లీ సినిమాల్లో చూడడానికి ఇష్టపడతారు, ప్రస్తుత జనరేషన్ కి రంభ ఎలా కనెక్ట్ అవుతుంది అనేది చూడాలి.