బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో మంచి టాలెంటెడ్ హీరోగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును అందుకున్న రణ్ బీర్ కపూర్ ప్రస్తుతం డిఫరెంట్ సినిమాలను లైన్లో పెడుతున్నాడు. ముఖ్యంగా బ్రహ్మాస్త్ర సినిమాతో కూడా పాన్ ఇండియా మార్కెట్ ను క్రియేట్ చేసుకోవాలని అనుకుంటున్నాడు. అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను ప్రముఖ దర్శక నిర్మాత కరణ్ జోహార్ నిర్మిస్తున్నాడు. ఆ సినిమా పై బాలీవుడ్ ఇండస్ట్రీలో అయితే అంచనాలు భారీగానే ఉన్నాయి.
ఇక తెలుగులో తమిళ్ మలయాళం కన్నడ లో కూడా భారీగానే విడుదల చేయాలని చూస్తున్నారు. ఏక్ తెలుగు సీనియర్ హీరో నాగార్జున కూడా ఈ సినిమాలో ఒక ముఖ్యమైన పాత్రలో కనిపించబోతున్నారు. అలియా భట్ హీరోయిన్ గా నటించిన విషయం తెలిసిందే. అయితే రణ్ బీర్ కపూర్ ఇటీవల నిర్వహించిన ప్రెస్ మీట్ లో తెలుగు సినిమాలపై అలాగే టాలీవుడ్ ఎంట్రీ పై కూడా ప్రత్యేకంగా క్లారిటీ ఇచ్చాడు.
రణ్ బీర్ మాట్లాడుతూ.. ఒక నటుడికి అన్ని రకాల పాత్రలు చేయాలని ఉంటుంది. అలాగే తన నటన అందరు చూడాలని అనుకుంటాడు. ఇక భాషతో సంబంధం లేకుండా కొత్త వారు తమ సినిమాలు చూస్తున్నారు అంటే అంతకంటే సంతోషం మరొకటి ఉండదు. కాబట్టి తెలుగులోనే కాకుండా మిగతా భాషల్లో అయినా సరే సినిమాలు చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. సినిమా అనేది ఒక భాషకు చెందినది కాదు. అది అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉండాలి.
అందుకే టాలీవుడ్ లో కూడా ఎంట్రీ ఇవ్వడానికి నాకు ఏమాత్రం అభ్యంతరం లేదు. అలాంటి అవకాశం వస్తే నేను వర్క్ చేయడానికి సిద్ధంగా ఉన్నాను. ఇక టాలీవుడ్ లో కూడా ప్రస్తుతం చాలా డిఫరెంట్ సినిమాలు తెరపైకి వస్తున్నాయి. ఇక సినిమా అనేది ఒక భాష తో సంబంధం లేకుండా అన్ని వర్గాల వారిని ఆకట్టుకునేలా ఉండాలి అని రణ్ బీర్ కపూర్ చాలా వివరంగా తెలియజేశారు.