నేషనల్ క్రష్ రష్మిక గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈమె పుష్ప సినిమా ద్వారా శ్రీవల్లిగా ఎంతో మంచి పేరు సంపాదించుకున్నారు. ఇలా పుష్ప సినిమా ద్వారా పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న రష్మిక ప్రస్తుతం వరుస పాన్ ఇండియా సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నారు ఈ క్రమంలోనే ఈమె వరుస బాలీవుడ్ సినిమాలను కూడా చేస్తూ కెరియర్ లో బిజీగా గడుపుతున్నారు. ఒక వైపు సినిమాలు చేస్తూనే మరోవైపు కమర్షియల్ యాడ్స్ చేస్తూ పలు సంస్థలకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నారు.
ఈ క్రమంలోనే రష్మిక మెక్డోనాల్డ్ సంస్థకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. అయితే కమర్షియల్ యాడ్ లో భాగంగా రష్మిక స్వయంగా ఒక కస్టమర్ కి ఫుడ్ డెలివరీ చేసి ఏకంగా డెలివరీ గర్ల్ మారిపోయారు. మెక్డోనాల్డ్స్ సెలబ్రిటీ మిల్స్ లో భాగంగా రష్మిక ఏకంగా స్కూటీలో కస్టమర్ ఇంటికి వెళ్లి ఫుడ్ డెలివరీ చేశారు. అయితే తమకు ఫుడ్ డెలివరీ చేసింది రష్మిక అనే విషయం తెలియగానే ఆ తల్లి కూతుర్ల ఆనందం మాటల్లో చెప్పలేనిది.
ఈ క్రమంలోనే ఏకంగా రష్మిక వారికి ఫుడ్ తీసుకురావడంతో సంతోషం వ్యక్తం చేయడమే కాకుండా తనతో ఫోటోలు కూడా దిగారు.అయితే ఈ సంఘటన ఈ ఏడాది మొదట్లో జరిగినప్పటికీ తిరిగి ఈ ఘటనకు సంబంధించిన వీడియోని సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. ఇకపోతే ఈమె సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం హిందీలో రణబీర్ కపూర్ సరసన ఈమె యానిమల్ సినిమాలో నటిస్తున్నారు.
తెలుగులో పుష్ప2 సీక్వెల్ చిత్రంలో బిజీ కానున్నారు. ఈ సినిమాతో పాటు తమిళ స్టార్ హీరో విజయ్ దళపతి సరసన వారసుడు సినిమాలో కూడా నటిస్తున్నారు. ఇలా మొత్తానికి వరుస సినిమాలతో ఈ ముద్దుగుమ్మ ఎంతో బిజీగా గడుపుతుంది.