‘పుష్ప: ర్యాంపేజ్’ ఎప్పుడు స్టార్ట్ చేస్తారు, ఎప్పుడు వస్తుంది.. అనే వివరాలు గురించి మాట్లాడితే టూ ఎర్లీ అవుతుంది కానీ.. ఆ సినిమా గరించి వచ్చిన, వస్తున్న పుకార్లు చూస్తుంటే మాట్లాడకపోతే టూ లేట్ అవుతుంది. ఎందుకంటే ఆ సినిమాలో విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) ఓ ప్రధాన పాత్రలో నటిస్తాడు అని పుకార్లు రావడమే. దానికి తోడు ‘ర్యాంపేజ్’ అనే పేరును తొలుత బయటకు చెప్పింది ఆయనే కావడం. ఈ విషయాన్ని ఆయన రూమర్డ్ గాళ్ ఫ్రెండ్ రష్మిక మందన (Rashmika Mandanna) దగ్గర ప్రస్తావిస్తే ఆసక్తికర సమాధానం ఇచ్చింది.
Rashmika
అలాగే మరో ఇంట్రెస్టింగ్ విషయం కూడా చెప్పింది. ‘పుష్ప 3’లో విజయ్ ఉన్నాడా? అంటే.. మీలాగే నాక్కూడా ఆ విషయం తెలియదు. దర్శకుడు సుకుమార్ (Sukumar) ప్రతి విషయంలో సస్పెన్స్ కొనసాగిస్తారు. చివరి వరకూ ఆ విషయాన్ని బయటపెట్టరు. ఇప్పుడూ అలానే చేస్తారేమో అనేలా మాట్లాడింది. అయితే ఉన్నాడా? లేదా? అనేది ఆమెకి ఈజీగా తెలుస్తుంది అని మనకు తెలుసు. ‘పుష్ప 2’ (Pushpa 2: The Rule) సినిమాకు సంబంధించిన విషయాలను కూడా సుకుమార్ షూటింగ్ సమయంలో సెట్‌లోనే చెప్పేవారని చెప్పారు.
అంటే రష్మిక (Rashmika) ఈ సినిమా ఏంటో పూర్తిగా తెలియకుండానే సినిమా ఓకే చేసింది, సినిమా సెట్స్‌కి వచ్చింది అన్నమాట. ఆ విషయం పక్కన పెడితే.. ఆమె కూడా సినిమా క్లైమాక్స్‌లో కనిపించిన వ్యక్తిని చూసి.. ‘ఇతనెవరు?’ అని నేనూ ఆశ్చర్యపోయిందట. అంతేకాదు అందరు ప్రేక్షకుల మాదిరిగానే తాను కూడా ఆ వ్యక్తి ఎవరో తెలుసుకోవడానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నా అని చెప్పింది.
అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ (Allu Arjun) తెరకెక్కించిన సరికొత్త చిత్రం ‘పుష్ప: ది రూల్’. 2021లో విడుదలైన ‘పుష్ప: ది రైజ్’(Pushpa)కు కొనసాగింపుగా వచ్చిన చిత్రమిది. విడుదలైన ఆరు రోజుల్లోనే రూ.1000 కోట్ల గ్రాస్ వసూలు చేసిన ఈ సినిమా ఇంకా రికార్డులు బద్ధలుకొడుతూనే ఉంది. సినిమా టీమ్ అయితే డబుల్ 1000 మీద దృష్టి పెట్టింది అని చెబుతున్నారు.