మాస్ మహారాజ్ రవితేజకి ‘ధమాకా’ తర్వాత సరైన హిట్టు లేదు. అంటే అతను హిట్టు కొట్టి ఆల్మోస్ట్ 3 ఏళ్ళు అయ్యింది అని చెప్పాలి. తర్వాత వచ్చిన ‘రావణాసుర’ ‘టైగర్ నాగేశ్వరరావు’ ‘ఈగల్’ ‘మిస్టర్ బచ్చన్’ వంటి సినిమాలు ఒకదాన్ని మించి మరొకటి అన్నట్టు డిజాస్టర్లుగా మిగిలిపోయాయి. ఈసారి ఎలాగైనా హిట్టు కొట్టాలని ‘మాస్ జాతర’ చేశాడు. ఏడాది గ్యాప్ తీసుకుని రవితేజ చేసిన సినిమా ఇది. పైగా అతని కెరీర్లో 75వ సినిమా. సో ఇది 2 రకాలుగా కూడా అభిమానులకు చాలా స్పెషల్ మూవీ. ట్రైలర్ అయితే బాగుంది.
కచ్చితంగా సూపర్ హిట్ కొడుతుంది అనే భరోసా ఇచ్చింది. దీని తర్వాత కిషోర్ తిరుమల దర్శకత్వంలో ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ అనే ఫ్యామిలీ మూవీ చేస్తున్నాడు రవితేజ. దీనిపై బజ్ అయితే లేదు కానీ… సంక్రాంతికి రిలీజ్ అయితే టార్గెటెడ్ ఆడియన్స్ ని మెప్పించే అవకాశాలు ఉంటాయి. ఇదిలా ఉండగా.. రవితేజ ఇప్పుడు మరో క్రేజీ ప్రాజెక్ట్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తుంది. ఇంకో విశేషం ఏంటంటే.. ఇది మల్టీస్టారర్ కావడం. అవును.. రవితేజతో చేతులు కలుపుతున్న హీరో మరెవరో కాదు నవీన్ పోలిశెట్టి.

యూత్ లో నవీన్ పోలిశెట్టికి సూపర్ క్రేజ్ ఉంది. జెంజి కిడ్స్ ఇతని సినిమాల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. నవీన్ కామెడీ టైమింగ్ చాలా బాగుంటుంది. రవితేజ కామెడీ టైమింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. వీళ్లిద్దరి కాంబోలో సినిమా వస్తే.. మామూలుగా ఉంటుందా? ఆల్రెడీ ఓ ప్రముఖ నిర్మాత.. రైటర్ ప్రసన్నకుమార్ బెజవాడతో స్క్రిప్ట్ రెడీ చేయించాడట. రవితేజకి అది బాగా నచ్చింది అని తెలుస్తుంది. నవీన్ పోలిశెట్టి కూడా ఓకే చెబితే.. వెంటనే సెట్స్ పైకి వెళ్లే అవకాశాలు ఉంటాయి.
