Power Collections: రవితేజ ‘పవర్’ కి 10 ఏళ్ళు.. ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందంటే?
- September 13, 2024 / 08:24 PM ISTByFilmy Focus
మాస్ మహారాజ్ రవితేజ (Ravi Teja) హీరోగా కె.ఎస్.రవీంద్ర (K. S. Ravindra) (బాబీ) దర్శకత్వంలో ‘పవర్’ (Power) అనే సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. ‘రాక్లైన్ ఎంటర్టైన్మెంట్స్’ బ్యానర్ పై రాక్లైన్ వెంకటేష్ (Rockline Venkatesh) ఈ చిత్రాన్ని నిర్మించగా తమన్ (S.S.Thaman) సంగీతం అందించాడు. 2014 సెప్టెంబర్ 12 న పెద్దగా అంచనాలు లేకుండా ప్రేక్షకుల ముందుకు వచ్చింది ‘పవర్’ చిత్రం. మొదటి షోతోనే ఈ సినిమా సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. రొటీన్ స్టోరీనే అయినప్పటికీ బాబీ టేకింగ్ చాలా కొత్తగా అనిపించింది.
Power Collections

స్క్రీన్ ప్లే, డైలాగ్స్.. అన్నీ కూడా ప్రేక్షకులకు ఓ కొత్త అనుభూతిని కలిగించాయి. అందుకే బాబీ స్టార్ డైరెక్టర్ గా ఎదిగి ‘వెంకీ మామ’ (Venky Mama) ‘వాల్తేరు వీరయ్య’ (Waltair Veerayya) వంటి సూపర్ హిట్ చిత్రాలు అందించాడు. ఇక నిన్నటితో ‘పవర్’ రిలీజ్ అయ్యి 10 ఏళ్ళు పూర్తి కావస్తోంది. మరి ఫుల్ రన్లో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎంత కలెక్ట్ చేసిందో ఓ లుక్కేద్దాం రండి :
| నైజాం | 8.50 cr |
| సీడెడ్ | 3.65 cr |
| ఉత్తరాంధ్ర | 2.20 cr |
| ఈస్ట్ | 1.49 cr |
| వెస్ట్ | 1.26 cr |
| గుంటూరు | 1.75 cr |
| కృష్ణా | 1.15 cr |
| నెల్లూరు | 0.80 cr |
| ఏపీ + తెలంగాణ (టోటల్) | 20.80 cr |
| రెస్ట్ ఆఫ్ ఇండియా | 2.96 Cr |
| ఓవర్సీస్ | 1.67 Cr |
| వరల్డ్ వైడ్ టోటల్ | 25.43 Cr |
‘పవర్’ చిత్రం రూ.23 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగింది. అయితే ఫుల్ రన్లో ఈ సినిమా రూ.25.43 కోట్ల షేర్ ను రాబట్టింది. బయ్యర్స్ కి రూ.2.43 కోట్ల లాభాలను అందించి క్లీన్ హిట్ గా నిలిచింది ‘పవర్’ మూవీ.
















