కొన్ని పుకార్లు బాగా కాస్ట్‌లీ. అంటే ఆ పుకార్ల కోసం బాగా ఖర్చవుతుంది అని. గత కొన్ని రోజులుగా ఓ పుకారు కోసం టాలీవుడ్‌లో చాలా ఖర్చయింది అని టాక్. అదే ‘రామ్‌చరణ్ 16వ (RC16 Movie) సినిమా నుండి ఏఆర్ రెహమాన్ (A.R.Rahman) బయటకు వెళ్లిపోయారు’ అని. ఇక్కడ కాస్ట్‌లీ అంటే ఎక్కువ మంది, ఎక్కువ సమయం ఖర్చు చేసిన పుకారు ఇది. రామ్‌చరణ్ (Ram Charan) సినిమాల గురించి గత కొన్ని రోజులుగా ఏదో ఒక పుకారు వస్తూనే ఉంది. ఈ క్రమంలో దీనికి రామ్‌చరణ్ టీమ్ క్లారిటీ ఇచ్చింది.
RC 16
రామ్ చరణ్ – బుచ్చిబాబు (Buchi Babu Sana) కాంబినేషన్‌లో ఓ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. జాన్వీ కపూర్ (Janhvi Kapoor) కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాకు ‘పెద్ది’ (RC 16) అనే పేరు పరిశీలనలో ఉంది. ఇక ఈ సినిమాను ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తారని సినిమా ప్రారంభానికి ముందే అనౌన్స్ చేశారు. సినిమా ప్రారంభోత్సవానికి ఆయన వచ్చారు కూడా. అయితే తాజాగా ఓ వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేసింది.
చరణ్ – బుచ్చి సినిమా నుండి రెహమాన్ తప్పుకున్నారని, ఆయన ప్లేస్‌లో దేవిశ్రీ ప్రసాద్ (Devi Sri Prasad) వచ్చారని ఆ పుకార్ల సారాంశం. ఇటీవల కాలంలో వరుస ఎగ్జిట్ వార్తలు వింటున్న నేపథ్యంలో ఇది కూడా నిజమే అనుకున్నారంతా. కానీ ఈ వార్త పూర్తిగా ఫేక్ అని సినిమా టీమ్ చెప్పింది. సినిమా కోసం రెహమాన్ ఇప్పటికే పాటల ట్యూన్స్ కూడా ఇచ్చారని చెప్పింది టీమ్. ఈ పుకారు షికారు ఇక్కడికైనా ఆగాలి అనేది చరణ్ ఫ్యాన్స్ కోరిక.
ఇక ఈ సినిమా విషయానికొస్తే ‘గేమ్ ఛేంజర్’ విడుదలకు ముందు మైసూరులో ఓ షెడ్యూల్ పూర్తి చేశారు. త్వరలో హైదరాబాద్‌లోనే ఓ షెడ్యూల్ ప్రారంభిస్తారని సమాచారం. త్వరలో షూటింగ్‌కి వెళ్తున్నారు అనే తరుణంలో ఇలా పుకార్లు షికార్లు చేయడం ఏ టీమ్‌కైనా చిరాకుగానే ఉంటుంది. కానీ ఏం చేస్తాం. ఇలాంటి పుకార్లు ఒక్కోసారి నిజాలవుతున్నాయి రీసెంట్ టైమ్‌లో.