మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) తదుపరి సినిమా RC16పై (RC 16 Movie) భారీ అంచనాలు నెలకొన్నాయి. ‘ఉప్పెన’ (Uppena) తో టాలీవుడ్‌లో హిట్ అందుకున్న బుచ్చిబాబు సానా (Buchi Babu Sana) , తన రెండో సినిమాను రామ్ చరణ్‌తో డైరెక్ట్ చేసే అవకాశం దక్కించుకోవడంతో ప్రాజెక్ట్‌పై ఆసక్తి మరింత పెరిగింది. ఈ సినిమా విలేజ్ స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కుతుండటంతో, కథపై పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. ఇక టైటిల్ విషయానికి వస్తే, ఇప్పటి వరకు ‘పెద్ది’ అనే పేరు వినిపించినా, ఇప్పుడు మరో ఆసక్తికరమైన పేరు తెరపైకి వచ్చింది.
ఇండస్ట్రీలో వినిపిస్తున్న లేటెస్ట్ టాక్ ప్రకారం, ‘పవర్ క్రికెట్’ అనే వర్కింగ్ టైటిల్‌ను మేకర్స్ లాక్ చేశారని అంటున్నారు. క్రికెట్ బ్యాక్‌డ్రాప్‌తో పాటు కుస్తీ కూడా ఇందులో కీలక పాత్ర పోషించబోతోందట. ఇదే టైటిల్‌ను ఫైనల్ చేస్తారా, లేక మరో పవర్‌ఫుల్ టైటిల్ అనౌన్స్ చేస్తారా అనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది. అయితే రామ్ చరణ్ పుట్టినరోజు (మార్చి 27) నాటికి టైటిల్ టీజర్ విడుదల చేసే అవకాశముంది. ఈ ప్రాజెక్ట్ షూటింగ్ ఇప్పటికే 22 రోజుల పాటు పూర్తయింది.
మేకర్స్ వచ్చే నెల నుంచి నెలకు 20 రోజులు షూట్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు. దీంతో సినిమా త్వరగా కంప్లీట్ అయ్యే అవకాశముంది. రామ్ చరణ్ ఈ సినిమాలో కొత్త లుక్‌లో కనిపించబోతున్నాడట. గ్రామీణ నేపథ్యంలో స్పోర్ట్స్ ఎలిమెంట్స్‌ను హైలైట్ చేస్తూ, బుచ్చిబాబు తన మార్క్ ఎమోషన్‌ను జోడిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో జాన్వీ కపూర్ (Janhvi Kapoor) హీరోయిన్‌గా నటిస్తోంది. శివరాజ్ కుమార్(Shiva Rajkumar), జగపతిబాబు (Jagapathi Babu) కీలక పాత్రల్లో కనిపించబోతున్నారని తెలుస్తోంది.
ఇక ఏఆర్ రెహమాన్ (A.R.Rahman) సంగీతం అందించడంతో సినిమా మ్యూజిక్ హైప్ మరింత పెరిగింది. ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్, వృద్ధి సినిమాస్, సుకుమార్ రైటింగ్స్ కలిసి నిర్మిస్తున్నాయి. కథపై బుచ్చిబాబు దాదాపు రెండు సంవత్సరాలుగా వర్క్ చేస్తున్నట్లు సమాచారం. మరి సినిమా నుంచి రాబోయే అప్డేట్స్ ఏ రేంజ్ లో ఉంటాయో చూడాలి.