ఎన్టీఆర్, చరణ్ ల మల్టీ స్టారర్ ఆర్ ఆర్ ఆర్ తో దశాబ్దాల కల నెరవేర్చాడు రాజమౌళి. నందమూరి , మెగా ఫ్యామిలీల మల్టీస్టారర్ ఆయన సాధ్యం చేశారు. చిరంజీవి కెరీర్ ప్రారంభంలో కొన్ని సినిమాలలో సీనియర్ ఎన్టీఆర్ తో కలిసి నటించారు. ఆ తరువాత మెగా ఫ్యామిలీ, నందమూరి ఫ్యామిలీ హీరోలు కలిసి నటించింది లేదు. ఇన్నేళ్లకు ఈ ఇరు కుటుంబాలకు చెందిన యంగ్ హీరోలు ఎన్టీఆర్, చరణ్ లు కలిసి నటిస్తున్నారు.
ఐతే రాజమౌళి ఈ భారీ పాన్ ఇండియా చిత్రం కోసం ఈ ఇద్దరు హీరోలనే ఎందుకు ఎంపిక చేశాడు అనేది ఆసక్తికర అంశం. టాలీవుడ్ లో రాజమౌళితో చేయని స్టార్ హీరోలు కొందరు ఉన్నప్పటికీ ఆయన ఇప్పటికే చేసిన ఎన్టీఆర్, చరణ్ లను ఎంచుకున్నారు. దీని వెనుక కారణనాన్ని రాజమౌళి తెలియజేయడం జరిగింది. రాజమౌళి ఎన్టీఆర్ తో మూడు సినిమాలు చేశారు, వీళ్లిద్దరి మొదటి చిత్రం స్టూడెంట్ నంబర్ వన్, ఆ తరువాత సింహాద్రి, మూడవ చిత్రంగా యమదొంగ వచ్చింది.
ఇక రామ్ చరణ్ తో 2009లో మగధీర సినిమా చేయడం జరిగింది. వీరిద్దరితో కలిసి పనిచేసిన అనుభవం ఉండడం ఒక కారణం కాగా, పరిశ్రమలో వీరిద్దరూ మంచి స్నేహితులు గా ఉన్నారు. ఇక పాత్రల గురించి వాటి స్కెచెస్ వేసి వివరించిన వెంటనే ఇద్దరు సినిమాకు అంగీకారం తెలిపారట. ఈ కారణాల చేత రాజమౌళి ఆర్ ఆర్ ఆర్ అనే భారీ చిత్రానికి హీరోలుగా ఎన్టీఆర్ , చరణ్ లని ఎంపిక చేశారు.