Roshan Kanakala : టాలీవుడ్‌లో ప్రముఖ దంపతులు సుమ – రాజీవ్ కనకాల కుమారుడిగా రోషన్ కనకాల అందరికీ సుపరిచితుడే. బబుల్ గమ్ సినిమాతో నటుడిగా తన ప్రయాణాన్ని మొదలుపెట్టిన రోషన్, తొలి ప్రయత్నంలోనే ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించారు. ప్రస్తుతం రోషన్ నటించిన రెండో చిత్రం ‘మోగ్లీ (Mowgli)’ రిలీజ్‌కు సిద్ధమవుతోంది. ప్రీమియర్ షోలు కొన్ని గంటల్లోనే ప్రారంభం కానుండగా, ప్రమోషన్స్‌లో భాగంగా రోషన్ వరుస ఇంటర్వ్యూలలో పాల్గొంటూ బిజీ బిజీగా ఉన్నారు.
Suma – Rajeev
ఇంటర్వ్యూలో ఆయన కుటుంబం గురించి కొన్ని ప్రశ్నలు అడుగగా రోషన్ ఇచ్చిన సమాధానాలు ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్ అయ్యాయి. ముఖ్యంగా సుమ – రాజీవ్ కనకాల విడాకులపై గతంలో ప్రచారం జరిగిన రూమర్ల గురించి స్పందించిన రోషన్, వాటిపై స్పష్టత ఇచ్చారు. ఆ వార్తలు మొదట వచ్చినప్పుడు కొంచెం ఇబ్బందిగా అనిపించిందని, కానీ వారి ఇంట్లో వాతావరణం ఎలా ఉంటుందో తనకు బాగా తెలుసు కాబట్టి తరువాత ఆ వార్తలను పట్టించుకోలేదని చెప్పారు.
ఇంట్లో అమ్మానాన్న ఎంతో సరదాగా ఉంటారని, బయట కనిపించే విదంగానే చాలా ప్రేమతో అన్యోన్యంగా జీవిస్తున్నారని రోషన్ తెలిపారు. అమ్మ వంట చేస్తుంటే నాన్న పాటలు పాడుతూ ఉంటారని , ఈ విధంగా తమ రోజువారీ ఇంటి వాతావరణం చాలా ఆహ్లాదంగా ఉంటుందని చెప్పారు. తల్లిదండ్రులు ఇద్దరు సెలెబ్రెటీలు అయినా కూడా ప్రస్తుతం రోషన్ తనదైన గుర్తింపు కోసం కష్టపడుతున్నాడు. ప్రస్తుతం మోగ్లీ విడుదలపై మంచి అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రం ఆయన కెరీర్‌కు కొత్త మైలురాయిగా మారుతుందేమో చూడాలి.