‘బాహుబలి’ సిరీస్ తర్వాత RRR మూవీతో.. తెలుగు సినిమా స్టామినా ఇదీ అని మరోసారి ప్రపంచానికి చాటిచెప్పారు దర్శకధీరుడు రాజమౌళి. మార్చి నెలాఖరులో మొదలైన ఈ చిత్రం సందడి బాక్సాఫీస్ బరిలో ఇంకా కొనసాగుతూనే ఉంది. రూ. 11 వందలకోట్లకు పైగా వసూళ్లు.. జపాన్‌లో రిలీజ్.. రాజమౌళి.. హాలీవుడ్‌లో ప్రతిష్టాత్మకంగా భావించే గవర్నర్స్ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమంలో పాల్గొనడం.. గోవాలో జరుగుతున్న 53వ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్‌లో మెయిన్ స్ట్రీమింగ్ కేటగిరీలో ప్రదర్శనకు ఎంపికవడం లాంటి పలు అరుదైన గౌరవాలు, ఘనత దక్కాయి.. దక్కుతున్నాయి..
ఇప్పుడు ‘ఆర్ఆర్ఆర్’ మరో రేర్ ఫీట్ సాధించింది. అది కూడా గత నెలలో గ్రాండ్‌గా రిలీజ్ అయిన జపాన్ దేశంలో కావడం విశేషం.. పైగా ‘బాహుబలి’ రికార్డులను బీట్ చేయడం అనేది హైలెట్.. జపాన్‌లో అత్యధిక కలెక్షన్లు సాధించిన రెండో భారతీయ చిత్రంగా నిలిచింది. అత్యంత వేగంగా 300 మిలియన్ల క్లబ్‌లో చేరిన మొదటి ఇండియన్ సినిమాగా.. ఇప్పటివరకు సెకండ్ ప్లేసులో ఉన్న ‘బాహుబలి 2’ని వెనక్కి నెట్టింది.జపాన్‌లో రిలీజ్ అయిన 34 రోజుల్లో ఆ దేశ కరెన్సీలో 305 మిలియన్ల యెన్లు..
అంటే దాదాపు రూ.17.9 కోట్లు కలెక్ట్ చేసింది. 27 ఏళ్ల క్రితం (1995) విడుదలైన సూపర్ స్టార్ రజినీ కాంత్ ‘ముత్తు’ చిత్రం రూ.23.5 కోట్లు వసూలు చేసి ఇప్పటికీ అత్యధిక వసూళ్లు సాధించిన భారతీయ చిత్రంగా మొదటి స్థానంలో ఉంది. రజినీకి జపాన్ దేశంలో ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి కొత్తగా చెప్పక్కర్లేదు. ఇన్ని సంవత్సరాలుగా ఈ రికార్డ్ రజినీ పేరిట ఉంది అంటేనే అర్థం చేసుకోవచ్చు. ‘ముత్తు’ తర్వాత రెండో స్థానంలో నిలిచింది ‘ఆర్ఆర్ఆర్’..
వచ్చే ఏడాది సూపర్ స్టార్ మహేష్ బాబుతో హాలీవుడ్ రేంజ్‌లో ఓ అడ్వంచర్ మూవీ ప్లాన్ చేస్తున్నారు జక్కన్న.. దీని గురించి రీసెంట్‌గా ఓ వీడియోలో చెప్పారు. ఇక యంగ్ టైగర్ ఎన్టీఆర్, కొరటాల శివ సినిమా కోసం ప్రిపేర్ అవుతుండగా.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, సిల్వర్ స్క్రీన్ సెల్యులాయిడ్ శంకర్ దర్శకత్వంలో నటిస్తున్న కొత్త ఫిలిం షూటింగ్ కోసం న్యూజిలాండ్‌లో ఉన్నాడు..