‘బాహుబలి'(సిరీస్) తర్వాత రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఆర్.ఆర్.ఆర్’ చిత్రం ఈరోజుతో 50 రోజులు పూర్తి చేసుకోబోతోంది. రాంచరణ్- ఎన్టీఆర్ వంటి స్టార్ హీరోలు నటించిన ఈ భారీ మల్టీస్టారర్ చిత్రం మార్చి 25న భారీ అంచనాల మధ్య తెలుగుతో పాటు తమిళ, హిందీ,మలయాళం, కన్నడ.. భాషల్లో ఏకకాలంలో విడుదలైంది. మొదటి రోజు కాస్త మిక్స్డ్ టాక్ ను మూటకట్టుకున్నప్పటికీ ఈ మూవీ భారీ కలెక్షన్లను సాధించింది. ఇండియన్ బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ రూ.1100 కోట్లకి పైగా గ్రాస్ వసూళ్ళని రాబట్టి రికార్డులు సృష్టించింది.
తెలుగు వెర్షన్ పరంగా ఈ మూవీ ‘బాహుబలి2’ కలెక్షన్లను అధిగమించింది. కొత్త సినిమాలు ఎన్ని విడుదలైనప్పటికీ ఈ మూవీ లాంగ్ రన్ కు బ్రేకులు వేయలేకపోయాయి. ఈరోజుతో ఈ చిత్రం విడుదలై 50 రోజులు పూర్తి కావస్తోంది. నైజాం లో 2 సెంటర్లు, సీడెడ్ లో 13 సెంటర్లు, ఆంధ్రప్రదేశ్ లో 9 సెంటర్లు మొత్తం కలుపుకొని .. 24 సెంటర్స్ లో డైరెక్ట్ గా 50 రోజులు ప్రదర్శింపబడుతోంది ‘ఆర్.ఆర్.ఆర్’.షిఫ్టులతో కలుపుకొని ఇంకో 10,11 ఉంటాయని సమాచారం.
మొత్తంగా 35 సెంటర్స్ లో ‘ఆర్.ఆర్.ఆర్’ అర్థశతదినోత్సవం జరుపుకోబోతుందన్న మాట. ఈ చిత్రంలో అల్లూరి సీతారామరాజు గా రాంచరణ్, కొమరం భీమ్ గా ఎన్టీఆర్ నటించారు. ఇద్దరూ కూడా చాలా అగ్రెసివ్ గా నటించారు. కొమరం భీముడొ పాటలో ఎన్టీఆర్ నట విశ్వరూపం చూపించాడు. క్లైమాక్స్ ల్లో రాంచరణ్ నటన బాగుంటుంది.
‘నాటు నాటు’ పాటలో వీళ్ళిద్దరూ కలిసి డాన్స్ చేస్తుంటే అభిమానులు థియేటర్లలో సంబరాలు చేసుకున్నారు. ఇక తెలుగు రాష్ట్రాల్లో 50 వ రోజు కాబట్టి.. చాలా వరకు సింగిల్ స్క్రీన్స్ లో మిడ్ నైట్ షోలు ప్రదర్శించనున్నారు.