RRR Collections: ‘బాహుబలి 2’ ని అధిగమించలేదు కానీ బిగ్ బ్లాక్ బస్టరే !

‘ఆర్.ఆర్.ఆర్’ ఫుల్ రన్ సక్సెస్ ఫుల్ గా ముగిసింది. తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఎన్టీఆర్, చరణ్ అభిమానులు 50 రోజుల వేడుకలు ఘనంగా నిర్వహించుకున్నారు . 35 సెంటర్ల వరకు ‘ఆర్.ఆర్.ఆర్’ 50 రోజులు ప్రదర్శింపబడింది. ‘ఆర్.ఆర్.ఆర్’ పక్కన ‘కె.జి.ఎఫ్2’ ‘ఆచార్య’ వంటి చిత్రాలు రిలీజ్ అయినా కూడా ఎక్కడా డౌన్ అవ్వలేదు.తెలుగు వెర్షన్ పరంగా ఈ మూవీ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. కానీ తెలుగు రాష్ట్రాల్లో కొన్ని చోట్ల ‘బాహుబలి 2’ కలెక్షన్లను అధిగమించ లేకపోయింది.

అలాగే ఫుల్ రన్లో కూడా ‘ఆర్.ఆర్.ఆర్’.. ‘బాహుబలి2’ కలెక్షన్లను అధిగమించలేదు. ఒకసారి క్లోజింగ్ కలెక్షన్స్ ను గమనిస్తే :

నైజాం 112.13 cr
సీడెడ్  50.66 cr
ఉత్తరాంధ్ర  33.30 cr
ఈస్ట్  16.40 cr
వెస్ట్  13.30 cr
గుంటూరు  18.17 cr
కృష్ణా  14.70 cr
నెల్లూరు  09.42 cr
ఏపీ + తెలంగాణ (టోటల్) 268.08 cr
తమిళనాడు  38.50 cr
కేరళ  10.80 cr
కర్ణాటక  44.42 cr
హిందీ 134.30 cr
ఓవర్సీస్ 102.50 cr
రెస్ట్  10.05 cr
టోటల్ వరల్డ్ వైడ్ 608.65 cr (అన్ని వెర్షన్లు కలుపుకుని)

‘ఆర్.ఆర్.ఆర్’ చిత్రానికి తెలుగుతో పాటు అన్ని వెర్షన్లు కలుపుకుని రూ.492 కోట్లు థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కావాలి అంటే రూ.500 కోట్ల వరకు షేర్ ను రాబట్టాలి.ఫుల్ రన్ ముగిసేసరికి ఈ చిత్రం రూ.608.65 కోట్ల భారీ షేర్ ను రాబట్టింది.గ్రాస్ పరంగా చూసుకుంటే రూ.1135(కరెక్టెడ్) కోట్లు కొల్లగొట్టింది.తెలుగు వెర్షన్ పరంగా ఈ మూవీ ఇండస్ట్రీ హిట్.

మిగిలిన వెర్షన్ లలో బ్రేక్ ఈవెన్ సాధించింది. లాభాలు తెచ్చిపెట్టింది. అయితే ‘బాహుబలి2’ ఓవరాల్ కలెక్షన్లను ‘ఆర్.ఆర్.ఆర్’ అధిగమించలేకపోయింది. ‘బాహుబలి 2’ ఫుల్ రన్లో రూ.814 కోట్ల పైనే షేర్ ను రాబట్టి.. రూ.1783 కోట్ల వరకు గ్రాస్ ను కొల్లగొట్టింది.

ఎఫ్ 3 సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

పెళ్లొద్దు.. సినిమాలే ముద్దు… అంటున్న 12 మంది నటీనటులు వీరే..!
తమ సొంత పేర్లనే సినిమాల్లో పాత్రలకి పెట్టుకున్న హీరోల లిస్ట్..!
ఈ 11 హీరోయిన్ల కాంబోలు అనేక సినిమాల్లో రిపీట్ అయ్యాయి..!

Share.