ఆర్ఆర్ఆర్ మూవీ విడుదలై 40 రోజులైనా బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా సంచలనాలు కొనసాగుతున్నాయి. బాక్సాఫీస్ వద్ద బాహుబలి2 క్రియేట్ చేసిన కొన్ని రికార్డులను ఆర్ఆర్ఆర్ మూవీ సులువుగానే బ్రేక్ చేసిందని సమాచారం. ఓటీటీల హవా పెరిగిన కాలంలో కూడా ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో ఆర్ఆర్ఆర్ సినిమా కనీవిని ఎరుగని రికార్డును సొంతం చేసుకోవడం గమనార్హం. ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో 5 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లు సాధించిన తొలి సినిమాగా ఆర్ఆర్ఆర్ నిలిచింది.
గతంలో బాహుబలి2 ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో ఏకంగా 3 కోట్ల 76 లక్షల 26 వేల రూపాయల కలెక్షన్లను సొంతం చేసుకుంది. అయితే ఆర్ఆర్ఆర్ ఫుల్ రన్ లో ఇక్కడ ఏ స్థాయిలో కలెక్షన్లను సొంతం చేసుకుంటుందో చూడాల్సి ఉంది. క్రాస్ రోడ్స్ లో సింగిల్ స్క్రీన్ల నుంచి ఈ స్థాయిలో కలెక్షన్లను సాధించడం సులువు కాదని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ఆర్ఆర్ఆర్ రికార్డుల విషయంలో అభిమానులు సంతృప్తితో ఉన్నారు.
మే 20వ తేదీ నుంచి ఆర్ఆర్ఆర్ ఓటీటీలో అందుబాటులోకి వస్తుందని ప్రచారం జరుగుతున్నా రెండు వారాల పాటు డబ్బులు చెల్లించి సినిమా చూడాల్సి ఉంటుందని జూన్ 3వ తేదీ నుంచి ఉచితంగా ఈ సినిమాను ఓటీటీలో చూడవచ్చని సమాచారం. తారక్ పుట్టినరోజు కానుకగా ఓటీటీలో ఈ సినిమా అందుబాటులోకి రానుండటం గమనార్హం. ఆర్ఆర్ఆర్ తెలుగు వెర్షన్ జీ5 ఓటీటీలో అందుబాటులోకి రానుంది.
థియేటర్లలో ఈ సినిమాను చూడని వాళ్లతో పాటు చూసిన వాళ్లు సైతం ఆర్ఆర్ఆర్ ఓటీటీ రిలీజ్ కొరకు ఎదురుచూస్తున్నారు. ఆర్ఆర్ఆర్ ఓటీటీలో ఎన్ని సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి. ఎన్టీఆర్, చరణ్ అభిమానులు తమ ఫేవరెట్ హీరోలు తర్వాత సినిమాలతో విజయాలను అందుకోవాలని భావిస్తున్నారు. ఆచార్య సినిమా నిరాశపరిచినా చరణ్ శంకర్ సినిమాతో సక్సెస్ ట్రాక్ లోకి వస్తారని ఫ్యాన్స్ భావిస్తున్నారు.