దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్ ఎన్టీఆర్ హీరోలుగా ఎంతో ప్రతిష్టాత్మకంగా పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిన చిత్రం ఆర్ఆర్ఆర్. ఈ సినిమా విడుదలయ్యి ఎలాంటి సంచలనాలను సృష్టించిందో మనకు తెలిసిందే. ఇప్పటివరకు ఇండియన్ సినిమాలకు ఆస్కార్ అవార్డు రాకపోగా ఈ సినిమాలోని నాటునాటు పాటకు ఆస్కార్ రావడం విశేషం. ఈ విధంగా అంతర్జాతీయ స్థాయిలో తెలుగు సినిమా సత్తా ఏంటో నిరూపించి ఆస్కార్ అందుకున్నటువంటి చిత్రంగా ఎంతో గుర్తింపు సంపాదించుకుంది.
ఇక ఈ సినిమా ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకోవడంతో ఈ సినిమాని ఇతర దేశాలలో కూడా పెద్ద ఎత్తున విడుదల చేసిన సంగతి మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ సినిమాని జపాన్ లో విడుదల చేయడానికి సిద్ధమయ్యారు. ఇదివరకే ఈ సినిమా జపాన్లో రిలీజ్ అయిన విషయం మనకు తెలిసిందే. అయితే అప్పుడు తెలుగు వెర్షన్ లో జపనీస్ సబ్ టైటిల్ తో విడుదల చేశారు. గత ఏడాది అక్టోబర్ 21వ తేదీ ఈ సినిమా జపాన్ లో విడుదల అయింది.
ఇక ఈ సినిమా విడుదల సమయంలో పెద్ద ఎత్తున చిత్ర బృందం జపాన్ వెళ్లి ప్రమోషన్ కార్యక్రమాలను కూడా నిర్వహించారు. ఇక ఈ సినిమా జపాన్ లో విడుదలై అద్భుతమైన రికార్డులను సృష్టించింది. 200 రోజులు పైగా పూర్తి చేసుకొని 130 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ ని అందుకుంది. అంతేకాదు అక్కడ పలు ఇంటర్నేషనల్ ఫిలిం రికార్డ్స్ తో పాటు కొన్ని జపాన్ మూవీస్ రికార్డ్స్ ను సైతం ఈ సినిమా బ్రేక్ చేసింది.
ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమా మరోసారి జపాన్ లో విడుదల కాబోతుంది అయితే ఈసారి పూర్తిగా జపనీస్ లాంగ్వేజ్ లోనే ఈ సినిమా విడుదల కానుంది అని తెలుస్తుంది. జులై 28న ఈ సినిమాని జపనీస్ లాంగ్వేజ్ లో గ్రాండ్ విడుదల కాబోతుంది. తెలుగు వేర్షన్ లోనే జపనీస్ సబ్ టైటిల్ తో రికార్డులు బద్దలు కొట్టిన ఈ సినిమా ఏకంగా జపనీస్ లాంగ్వేజ్ లో విడుదల అయితే ఎలాంటి రికార్డులను సృష్టిస్తుందో తెలియాల్సి ఉంది.