సాహితి దాసరి (Sahithi Dasari) అందరికీ సుపరిచితమే. ‘పొలిమేర’ (Maa Oori Polimera) ‘పొలిమేర 2’ (Maa Oori Polimera 2) సినిమాలతో ఈమె బాగా పాపులర్ అయ్యింది. ఇప్పుడిప్పుడే సినిమాల్లో బిజీ అవుతున్న సాహితీ.. ఇటీవల చేవెళ్ల నియోజకవర్గం నుండి ఇండిపెండెంట్ గా ఎంపీ పదవికి పోటీ చేస్తున్నట్లు నామినేషన్ వేసి చర్చనీయాంశం అయ్యింది. అది పక్కన పెడితే… దానికి ముందు సాహితి దాసరి మహేష్ బాబు (Mahesh Babu) ‘గుంటూరు కారం’ (Guntur Kaaram) సినిమాలోని ‘కుర్చీ మడతపెట్టి’ సాంగ్ కి డాన్స్ చేసి హాట్ టాపిక్ అయ్యింది.
అయితే ఈమె డాన్స్ వీడియోలో వైసీపీ పార్టీకి సంబంధించిన గుర్తులు కనిపించాయని, పరోక్షంగా ఈమె ఆ పార్టీకి ప్రచారం చేస్తుందని సోషల్ మీడియాలో అంతా అభిప్రాయపడ్డారు. ఆ వీడియో వల్ల జనసేన, వైసీపీ అభిమానుల మధ్య చిన్నపాటి ఆర్గ్యుమెంట్లు కూడా చోటు చేసుకున్నాయి. సాహితి లేటెస్ట్ ఇంటర్వ్యూలో ఈ విషయం పై క్లారిటీ ఇచ్చింది. ఆమె ఈ విషయంపై స్పందిస్తూ.. “లైట్ కావాలని టెర్రస్ పైకి వెళ్లి నేను ‘కుర్చీ మడతపెట్టి’ సాంగ్ కి డాన్స్ చేశాను.
వీడియో బాగా వస్తుంది అనే ఉద్దేశంతో అలా చేయడం జరిగింది. కానీ వెనుక వై.యస్.జగన్ గారి హోర్డింగ్ కనిపిస్తుంది. అది కూడా ఒక్క వీడియోలో కనిపిస్తుంది. అప్పటికీ నేను ఆ వీడియో పోస్ట్ చేశాక నెగిటివ్ కామెంట్స్ వస్తున్నాయని డిలీట్ చేశాను. అయినా సరే సెకండ్ వీడియోకి నేను ‘వై.ఎస్.ఆర్.సి.పి’ పార్టీకి సపోర్ట్ చేస్తున్నానని చెప్పి నెగిటివ్ కామెంట్స్ చేయడం మొదలుపెట్టారు.
అప్పుడు నేను మీరు అనుకుంటే అనుకోండి అని లైట్ తీసుకున్నాను. కానీ ఆ వీడియో వల్ల కొంతమంది పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఫ్యాన్స్, జగన్ ఫ్యాన్స్ మధ్య ఓ వార్ జరిగింది. ఒక 2,3 రోజులు ఆ వీడియో వల్ల రచ్చ జరిగింది.ఆ టైంలో చాలా మంది నాకు ఫోన్లు చేసి ‘పాలిటిక్స్ లో ఎవరికైనా సపోర్ట్ చేస్తున్నావా?’ అని నన్ను అడిగారు. ‘అలాంటిదేమీ లేదు’ అని నేను సమాధానం ఇచ్చాను” అంటూ సాహితి చెప్పుకొచ్చింది.