Sai Dharam Tej: పెద్ద ప్రమాదం జరిగినా బైక్ రైడ్ మానని సాయి ధరమ్ తేజ్ వీడియో వైరల్!

సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ బైక్ ప్రమాదంలో పడి తీవ్ర గాయాలైన విషయం మనకు తెలిసిందే. ఇలా ఈయన దాదాపు నెల రోజుల పాటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఈ ప్రమాదం నుంచి కోలుకున్న సంగతి మనకు తెలిసిందే. ఇలా ప్రమాదం జరిగిన తరువాత దాదాపు ఏడాదిగా సినిమాలకు దూరంగా ఉన్నటువంటి ఈయన తాజాగా విరూపాక్ష సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. అదేవిధంగా మేనమామ పవన్ కళ్యాణ్ తో నటిస్తున్న వినోదయ సిత్తం రీమేక్ కూడా ప్రారంభం అయింది.

ఇలా అతి పెద్ద ప్రమాదం నుంచి బయటపడిన సాయి ధరమ్ తేజ్ ప్రమాదం నుంచి కోలుకున్న తర్వాత కూడా మరోసారి బైక్ రైడింగ్ చేస్తూ సందడి చేశారు. అయితే ఈయన నటిస్తున్న విరుపాక్ష సినిమా నుంచి ఒక మేకింగ్ వీడియోని విడుదల చేశారు. ఈ వీడియోలో భాగంగా సాయిధరమ్ తేజ్ వేగంగా బైక్ నడుపుతూ కనిపిస్తున్నాడు. ఈ సన్నివేశం గురించి దర్శకుడు కార్తీక్ దండు వీడియోలో వివరించారు. కోవిడ్ తర్వాత విరుపాక్ష సినిమాను ప్రారంభించాలని అనుకున్నాము.

కానీ అదే సమయంలో సాయి ధరమ్ తేజ్ ప్రమాదానికి గురి అయ్యారు. ఇక ఈ సినిమాలో బైక్ సన్నివేశంలో నటించాల్సి ఉంది. ఆయన అప్పుడప్పుడు ఈ ప్రమాదం నుంచి కోలుకొని వస్తున్నారు. ఇక ఈ సన్నివేశంలో నటించడానికి డూప్ వెళ్ళితే బెటర్ అని అనుకున్నాం. ఆది చిన్న చెరువు కట్ట.. ఇటువైపు చెరువు. మరోవైపు లోయ.. దానివైపు 100 వరకు స్పీడ్ తో బైక్ రైడింగ్ చేసి బ్రేక్ కొట్టాలి.

అలాంటి కండిషన్ లో ఎవరు చేసినా చాలా రిస్క్ గానే ఉంటుంది. అందుకే డూప్ పెట్టాలి అనుకున్నాను. కానీ లేదు నేనే చేస్తా.. నాలో ఉన్న భయాన్ని జయించాలి అని తేజు సింగిల్ డే లో ఈ షాట్ పర్ఫెక్ట్ గా ఫినిష్ చేశారనీ ఈ సందర్భంగా సాయి తేజ్ బైక్ రేసింగ్ గురించి డైరెక్టర్ వెల్లడించారు. ఇక ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన మేకింగ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

సార్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘గజిని’ మూవీ మిస్ చేసుకున్న హీరోలు ఎవరంటే?

టాప్ 10 రెమ్యూనరేషన్ తెలుగు హీరోలు…ఎంతో తెలుసా ?
కళ్యాణ్ రామ్ నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus