ఫిదా సినిమాతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చినప్పటికీ సాయి పల్లవి అంతకుముందే తెలుగు ఆడియెన్స్ కు బాగా దగ్గరైంది. ఆమె మలయాళం ప్రేమమ్ కు తెలుగు ఫ్యాన్స్ చాలా మందే ఉన్నారు. ఇక ఫిదా అనంతరం తన క్రేజ్ ను మరింత పెంచుకున్న ఈ బ్యూటీ ఆ తరువాత తమిళ్ కూడా తనకంటూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ ను అందుకుంది. వీలైనంతవరకు తనకు సెట్టయ్యే కథలనే ఎంచుకుంటోంది.
ఇక ఇటీవల పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి మలయాళం రీమేక్ లో హీరోయిన్ గా లక్కీ ఛాన్స్ కొట్టేసినట్లు టాక్ వస్తున్న విషయం తెలిసిందే. పవన్ కళ్యాణ్ కు సాయి పల్లవి జోడిగా నటిస్తుండగా ఐశ్వర్య రాజేష్ రానా కోసం ఫిక్స్ అయినట్లు టాక్ వస్తోంది. అయితే సినిమా కోసం సాయి పల్లవి భారీ రెమ్యునరేషన్ ను డిమాండ్ చేసినట్లు రూమర్స్ వస్తున్నాయి.
ప్రస్తుతం కోటికి పైగా అందుకుంటున్న అమ్మడు ఆ సినిమాకైతే 2కోట్ల వరకు అడిగినట్లు కథనాలు వెలువడుతున్నాయి. గతంలో సాయి పల్లవి రెమ్యునరేషన్స్ పై చాలా రకాల రూమర్స్ వచ్చాయి. అయితే అవన్నీ రూమర్స్ అని కొందరు నిర్మాతలే కొట్టి పారేశారు. ఇక ఇప్పుడు 2కోట్లు ఇస్తేనే సినిమా చేస్తానని చెబుతున్నట్లు రూమర్స్ వస్తున్నాయి. మరి ఆ రూమర్స్ ఎంతవరకు నిజమో తెలియాలి అంటే నిర్మాతలే క్లారిటీ ఇవ్వాలి.