సంచలన నిర్ణయంతో అభినందనలు అందుకుంటున్న సాయి పల్లవి
- August 12, 2017 / 10:38 AM ISTByFilmy Focus
సినిమాలో ఒకే ఒక్క ఛాన్స్ వస్తే చాలు … ఒక్క హిట్ చాలు.. ఆ తర్వాత నా స్టైల్ ఏంటో చూపిస్తా.. అనే వారిని చాలామందిని చూసి ఉంటాం. ఎందుకంటే సినిమాలో హీరోగా, హీరోయిన్ గా ఒక విజయం అందుకుంటే .. వారికీ ఉండే క్రేజ్ అంత ఇంతా కాదు. అడుగు పెడితే కనక వర్షం కురుస్తుంది. సినిమా ఛాన్స్ తో పాటు ఈవెంట్స్ కి వెళ్లినా లక్షలు వస్తాయి. ఈ పేరుని, డబ్బులను ఎవరూ వదులుకోరు.. కానీ ఆ క్రేజ్ ని, క్యాష్ ని పక్కన పెట్టి సాయి పల్లవి టాక్ ఆఫ్ టాలీవుడ్ అయింది. మలయాళంలో ప్రేమమ్ సినిమాతో హిట్ అందుకున్న ఈ బ్యూటీ తెలుగులోనూ ఫిదా తో సూపర్ హిట్ అందుకుంది. ఆఫర్లు వచ్చి పడుతున్నా, కోట్లు ఆఫర్ చేస్తున్న తనకి నచ్చిన వాటినే ఎంచుకుంటోంది. అంతేకాదు రీసెంట్ గా ఆమెను ఓ షాప్ ఓపెనింగ్ కి పిలిచారు. దీనికి పెద్ద మొత్తం ఆఫర్ చేశారు.
అయినా ఆ కార్యక్రమంలో పాల్గొనడానికి సాయిపల్లవి నో చెప్పింది. అంతేకాదు “ఆసుపత్రుల ప్రారంభోత్సవాలు, స్వచ్ఛంద సంస్థల కార్యక్రమాలకు వస్తాను. ఇలాంటి కమర్షియల్ కార్యక్రమాలకు నేను రాను” అని ఫిదా బ్యూటీ స్పష్టం చేసినట్లు ఫిలిం నగర్ వాసులు చెప్పుకుంటున్నారు. కాస్త క్రేజ్ వస్తే క్యాష్ చేసుకోవాలని చూస్తున్న ఈ సమయంలో ఇలాంటి పిల్లని చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. సాయి పల్లవి రూటే వేరని అభినందిస్తున్నారు. ఆమె ఇప్పుడు నాని సరసన ఎంసీఏ మూవీలో నటిస్తోంది. ఆ తర్వాత తన వైద్య విద్యను కొనసాగించాలని భావిస్తోంది.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.
















