టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఎలాంటి సినిమా చేసినా కూడా పాన్ ఇండియా రేంజ్ కు ఏ మాత్రం తీసిపోని విధంగా ఉంటుందని మరోసారి క్లారిటీ వచ్చేసింది. బాహుబలి, సాహో అనంతరం డార్లింగ్ నుంచి వస్తున్న హార్ట్ టచింగ్ లవ్ స్టొరీ రాధేశ్యామ్ పై రోజురోజుకు అంచనాల డోస్ అమాంతం పెరుగుతున్నాయి. పూజ హెగ్డే సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన ప్రతి అంశం కూడా ప్రేక్షకుల్లో పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ చేస్తున్నాయి.
ఇప్పటికే వరుసగా రెండు పాటలను విడుదల చేసిన రాధేశ్యామ్ టీం ఇప్పుడు మూడో పాటను కూడా విడుదల చేసింది.మూడో పాట ‘సంచారి’తో రెబల్ స్టార్ సరికొత్తగా ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు. ఈ పాటలో ప్రభాస్ స్టయిలిష్ లుక్ లో ఒక ట్రావెలర్ గా కనిపిస్తున్నట్లు అర్ధమవుతోంది. ఇక పాట మొత్తాన్ని విదేశాల్లోనే చిత్రీకరించారు. ఈ పాటను కృష్ణకాంత్ రచించగా తమిళ యువ సంగీత దర్శకుడు అనిరుద్ రవిచంద్రన్ ఆలపించాడు. జస్టిన్ ప్రభాకరన్ మ్యూజిక్ అందించిన విషయం తెలిసిందే.
ఈ సినిమాకు సంబంధించిన మ్యూజిక్ విషయంలో కూడా చిత్ర యూనిట్ సభ్యులు చాలా విభిన్నంగా అడుగులు వేస్తున్నారు.సౌత్ ఇండస్ట్రీలో జస్టిన్ ప్రభాకరన్ మ్యూజిక్ అందిస్తుండగా నార్త్ లో మాత్రం ఓ విభిన్నమైన మ్యూజిక్ ను అందిస్తున్నారు. ముగ్గురు డిఫరెంట్ మ్యూజిక్ డైరెక్టర్స్ ను కూడా సెట్ చేసుకున్నారు. కేవలం మ్యూజిక్ విషయంలోనే కాకుండా బ్యాగ్రౌండ్ మ్యూజిక్ లో కూడా నార్త్ సౌత్ ప్రేక్షకులకు డిఫరెంట్ భావాన్ని కలిగించేలా సినిమాను రెడీ చేస్తున్నట్లు సమాచారం.
రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాని యు.వి.క్రియేషన్స్ గోపికృష్ణ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న విషయం తెలిసిందే. తప్పకుండా సినిమా పాన్ ఇండియా రేంజ్ కు తగ్గట్లుగానే ఉంటుంది అని ఇప్పటికే టీజర్ తో ఒక క్లారిటీ వచ్చేసింది. ఇక భారీ స్థాయిలో విజయాన్ని అందుకోవాలని రెబల్ స్టార్ ప్రభాస్ ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నాడు. ఎందుకంటే సాహో సినిమా అనుకున్నంత స్థాయిలో సక్సెస్ కాలేక పోయింది. ఇక ఇప్పుడు రాధేశ్యామ్ సినిమాపై రెబల్ స్టార్ మంచి నమ్మకంతో ఉన్నట్లు తెలుస్తోంది. మరి సినిమా బాక్సాఫీస్ వద్ద ఇలాంటి ఓపెనింగ్స్ అందుకుంటుందో చూడాలి.