సంతోష్ శోభన్ (Santosh Sobhan) తమ్ముడు సంగీత్ శోభన్ (Sangeeth Shobhan) అందరికీ సుపరిచితమే. చెప్పాలంటే అతనికంటే ఇతనే ఎక్కువగా పాపులారిటీ సంపాదించుకున్నాడు అని చెప్పాలి. ‘ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ’ ‘ది బేకర్ అండ్ ది బ్యూటీ’ ఓటీటీ కంటెంట్ తో పాపులర్ అయిన ఇతను.. ‘మ్యాడ్’ తో (MAD) మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు. దామోదర్ అలియాస్ డిడి పాత్రలో వన్ మెన్ షో చేశాడు. ఆ సినిమాలో అద్భుతంగా కామెడీ పండించాడు. సెకండాఫ్ కూడా ఇతని పాత్ర చుట్టూనే తిరుగుతుంది.
దీంతో సంగీత్ శోభన్ చాలా వరకు వన్ మెన్ షో చేశాడు అని చెప్పాలి. ఇక ఇటీవల వచ్చిన ‘మ్యాడ్ స్క్వేర్’ లో (Mad Square) కూడా ఇతని కామెడీనే ఎక్కువ హైలెట్ అయ్యింది. కామెడీ చేయడం అంటే చాలా కష్టం. ఇది కనుక కరెక్ట్ గా చేస్తే.. ఎలాంటి పాత్రనైనా ఈజీగా చేసే అవకాశం ఉంటుంది.సంగీత్ శోభన్ పై నమ్మకం పెరగడానికి కారణం అదే కావచ్చు. దానిని అడ్వాంటేజ్ గా తీసుకుని సంగీత్ శోభన్.. అత్యాశకి పోతున్నట్టు ఇన్సైడ్ టాక్.
అది పారితోషికం విషయంలోనే..! అవును ‘మ్యాడ్’ ‘మ్యాడ్ స్క్వేర్’ హిట్ అవ్వడంతో సంగీత్ శోభన్ భారీగా పారితోషికం డిమాండ్ చేస్తున్నాడట. ‘మ్యాడ్ స్క్వేర్’ కి ముందు రూ.70 లక్షలు, కోటి వరకు డిమాండ్ చేశాడట. కొన్నిటికి రూ.70 లక్షలు రూ.75 లక్షలకి ఫిక్స్ అవుదామని చెప్పాడట. కానీ ‘మ్యాడ్ స్క్వేర్’ హిట్ అయ్యాక.. అమాంతం పెంచేశాడట. ఇప్పుడు అతను ఏకంగా కోటిన్నర డిమాండ్ చేస్తున్నాడట.
దీంతో దర్శక నిర్మాతలు షాక్ అవుతున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం అతను నిహారిక కొణిదెల (Niharika) నిర్మాణంలో ఒక సినిమా చేస్తున్నాడు. ఇది ‘మ్యాడ్ స్క్వేర్’ కి ముందుగా కమిట్ అయిన ప్రాజెక్టు. దీని కోసం రూ.75 లక్షలు తీసుకోబోతున్నాడట. నిహారిక అంటే మెగా హీరోల పుషింగ్ ఉంటుంది కాబట్టి.. ఇంత తక్కువకి అతను ఒప్పుకున్నట్టు సమాచారం. మిగిలిన దర్శకనిర్మాతలకు కోటిన్నర ఫైనల్ అని చెబుతున్నాడట.