బాబీ కొల్లి (K. S. Ravindra) దర్శకత్వంలో మెగాస్టార్ (Chiranjeevi) ‘వాల్తేరు వీరయ్య’ (Waltair Veerayya) అనే సినిమా చేశారు. ఇది మంచి విజయాన్ని అందుకుంది. 2023 సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ.230 కోట్లు కలెక్ట్ చేసింది. కథ పరంగా ఇది కొత్తగా ఏమీ లేకపోయినా.. బాబీ టేకింగ్ అందరికీ బాగా నచ్చింది. అలాగే బాబీ పనితనం మెగాస్టార్ చిరంజీవిని బాగా ఇంప్రెస్ చేసింది.నిర్మాతల జేబులకు చిల్లులు పెట్టకుండా… స్క్రిప్టుని సకాలంలో పూర్తి చేసి, షూటింగ్ పార్ట్ ను కూడా ఫాస్ట్ గా కంప్లీట్ చేయడం అనేది చిరంజీవి ఆశ్చర్యపోయేలా చేసింది.
పైగా అతను చిరంజీవి,పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)..లకు వీరాభిమాని. ఇంతకంటే క్వాలిటీస్ ఏమైనా కావాలా? చిరంజీవి ఇంప్రెస్ అవ్వడానికి..!?అందుకే బాబీ కొల్లి దర్శకత్వంలో మరో సినిమా చేయడానికి చిరు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. కథ,స్క్రిప్ట్ కూడా లాక్ అయిపోయాయి. ఎటొచ్చి ఒక్కటే సమస్య. అదేంటంటే.. ముందుగా ఈ ప్రాజెక్టుని ‘మైత్రి మూవీ మేకర్స్’ సంస్థ నిర్మించడానికి ముందుకు వచ్చింది. కానీ ఇప్పుడు ఈ సంస్థ చేతిలో చాలా పెద్ద ప్రాజెక్టులు ఉన్నాయి.
సో బాబీ- చిరు సినిమాపై ఇలాంటి టైంలో ఫోకస్ పెట్టలేని పరిస్థితి. అందుకే వాళ్ళు ఈ ప్రాజెక్టు నుండి తప్పుకోవడం జరిగిందట. ఇప్పుడు ఈ ప్రాజెక్టుని టేకప్ చేసే నిర్మాత కావాలి. ఈ ప్రాజెక్టుకు రూ.200 కోట్లు బడ్జెట్ పెట్టాలట. పారితోషికాల రూపంలోనే రూ.100 కోట్లు పెట్టాల్సి ఉంటుందట. సినిమా మేకింగ్ కాస్ట్ మరో రూ.100 కోట్లు ఉంటుంది అని వినికిడి.