Sarangapani Jathakam: ‘సారంగపాణి జాతకం’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!
- April 25, 2025 / 05:15 PM ISTByPhani Kumar
ప్రియదర్శి (Priyadarshi) ఈ మధ్యనే ‘కోర్ట్’ తో (Court) ఓ బ్లాక్ బస్టర్ కొట్టాడు. ఆ సినిమా ఏకంగా రూ.50 కోట్లు కలెక్ట్ చేసింది. మేకర్స్ ఆశించిన దానికంటే పది రెట్లు, ఆ సినిమా కలెక్ట్ చేసింది. దీంతో ప్రియదర్శి నెక్స్ట్ సినిమా ‘సారంగపాణి జాతకం’ (Sarangapani Jathakam) పై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. టీజర్, ట్రైలర్స్ కూడా ఇంప్రెస్ చేశాయి. కామెడీ సినిమాలకి మంచి డిమాండ్ ఉంది ఈరోజుల్లో. పైగా మినిమమ్ గ్యారంటీ దర్శకుడిగా పేరున్న ఇంద్రగంటి మోహన్ కృష్ణ (Mohana Krishna Indraganti) దర్శకుడు.
Sarangapani Jathakam

అందువల్ల ఏప్రిల్ 25న రిలీజ్ కాబోతున్న ఈ సినిమాకి బిజినెస్ బాగానే జరిగింది. ఒకసారి వాటి వివరాలు గమనిస్తే :
| నైజాం | 2.50 cr |
| సీడెడ్ | 0.50 cr |
| ఆంధ్ర | 2.50 cr |
| ఏపీ + తెలంగాణ(టోటల్) | 5.50 cr |
| రెస్ట్ ఆఫ్ ఇండియా | 0.50 cr |
| ఓవర్సీస్ | 0.60 cr |
| వరల్డ్ వైడ్ (టోటల్) | 6.60 cr |
‘సారంగపాణి జాతకం’ సినిమాకి రూ.6.6 కోట్లు థియేట్రికల్ బిజినెస్ జరిగింది. బ్రేక్ ఈవెన్ కోసం రూ.7 కోట్ల వరకు షేర్ ను రాబట్టాల్సి ఉంది. పాజిటివ్ టాక్ కనుక వస్తే… బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఈ వారం పెద్దగా బజ్ ఉన్న సినిమాలు ఏవీ లేవు కాబట్టి.. ఈ సినిమానే ఆడియన్స్ కి ఫస్ట్ ఛాయిస్ అయ్యే అవకాశం ఉంది.












