మన సినిమాలు జపాన్ వెళ్లడం పెద్ద విషయమేమీ కాదు. ఎందుకంటే ఈ మధ్య కాలంలో మన దేశానికి చెందిన చాలా సినిమాలు జపనీస్‌లో డబ్బింగ్ అయి అక్కడ దుమ్మురేపుతున్నాయి. అయితే వాటిలో ఎక్కువ శాతం అగ్ర హీరోల సినిమాలే ఉంటాయి. లేదంటే పాన్ ఇండియా లెవల్‌లో భారీ విజయం అందుకున్న సినిమాలూ ఉంటాయి. కానీ తొలిసారి యంగ్ స్టార్ హీరో సినిమా అక్కడికి వెళ్తోంది. ఈ మేరకు ఏర్పాట్లు ఊపందుకున్నాయి.
Saripodhaa Sanivaaram
నాని (Nani) కెరీర్‌లో రూ.వంద కోట్ల వసూళ్లు అందుకున్న రెండో సినిమా ‘సరిపోదా శనివారం’(Saripodhaa Sanivaaram). నానికి మాస్ ఇమేజ్ ఇప్పటికే ఉన్నా.. దానిని మరో లెవల్‌కి తీసుకెళ్లిన సినిమాఇది. నాని, ఎస్‌జే సూర్య (SJ Suryah) మధ్య కెమిస్ట్రీ ఓ రేంజిలో వర్కవుట్ అయింది. ఇద్దరూ పోటాపోటీగా నటించి మెప్పించారు. దీంతో బాక్సాఫీసు దగ్గర భారీ విజయం దక్కింది. ఓటీటీలోకి వచ్చాక దేశవ్యాప్తంగా కూడా మంచి టాక్ సంపాదించుకుంటూ వచ్చింది.
ఆ సినిమానే ఇప్పుడు జపాన్ వెళ్తోంది. ‘సూర్యాస్ సాటర్ డే’ అనే పేరుతో ఫిబ్రవరి 14న జపాన్‌లో థియేటర్లలో రిలీజ్ చేయబోతున్నారు. ఈ విషయం ఆసక్తికరంగా ఉన్నా ఇప్పుడు రిలీజ్ చేయడం రిస్క్ అనే టాక్ వినిపిస్తోంది. ఎందుకంటే ఇండియన్ సినిమాలకు అక్కడ సరైన రెస్పాన్స్ రావడం లేదు. రీసెంట్‌గా అక్కడ విడుదలైన ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD) సినిమాకు పెద్దగా ఆదరణ దక్కలేదు. అందుకే టీమ్ కూడా పెద్దగా ఆ సినిమా ప్రచారం చేయలేదు. ఇప్పుడు నానికి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి.