అలా అని కేవలం హీరోగానే నటించాలి అని పట్టుబట్టి కూర్చోలేదు. సెకండ్ హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా సినిమాల్లో నటిస్తున్నాడు. లాక్ డౌన్ టైంలో నేరుగా ఓటీటీలో రిలీజ్ అయిన ‘ఉమా మహేశ్వర ఉగ్రరూపస్య’ (Uma Maheswara Ugra Roopasya) చిత్రం ఇతనికి మొదటి సక్సెస్ ను అందించింది. అది ఓటీటీ హిట్. కానీ దాని తర్వాత సత్యదేవ్ నటించిన ‘తిమ్మరుసు’ (Thimmarusu) ‘స్కై ల్యాబ్’ (Skylab) ‘గాడ్ సే’ (Godse) ‘గుర్తుందా శీతాకాలం’ వంటి సినిమాలు థియేటర్లలో రిలీజ్ అయ్యాయి. ఇందులో ఒక్కటంటే ఒక్కటి కూడా సక్సెస్ కాలేదు.
ఎందుకో 2022 లో వచ్చిన ‘గుర్తుందా శీతాకాలం’ (Gurthunda Seethakalam) తర్వాత గ్యాప్ తీసుకున్నాడు సత్యదేవ్. ఆ తర్వాత అతని నుండి ఒక్క సినిమా కూడా రాలేదు. మొత్తానికి ఈ మే 10 న ‘కృష్ణమ్మ’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు సత్యదేవ్. దీనిపై బజ్ అయితే లేదు. ఇంకో పక్క థియేటర్లలో సినిమా చూడటానికి జనాలు కూడా రావడం లేదు. ఇలాంటి టైంలో రిలీజ్ అవుతున్న సత్యదేవ్ ‘కృష్ణమ్మ’ కి (Krishnamma) సూపర్ హిట్ టాక్ వచ్చినా ఓపెనింగ్స్ వస్తాయా? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. చూడాలి మరి..!