విక్టరీ వెంకటేష్, సూపర్ స్టార్ మహేష్ బాబు లు హీరోలుగా..అంజలి, సమంత లు హీరోయిన్లుగా శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’. ‘శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్’ బ్యానర్ పై దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మించారు. టాలీవుడ్లో చాలా గ్యాప్ తర్వాత రూపొందిన మల్టీ స్టారర్ చిత్రమిది. ఓ రకంగా ఇప్పుడు మల్టీ స్టారర్ చిత్రాలు ఎక్కువగా రూపొందుతున్నాయి అంటే దానికి ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ చిత్రం ఇచ్చిన పుషింగ్ ఎంతో ఉందని చెప్పాలి.
‘పెళ్ళి సందడి’ చిత్రాన్ని ఏ విధంగా ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తున్నారో.. అదే విధంగా ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ చిత్రాన్ని కూడా ఎంజాయ్ చేస్తున్నారు ప్రేక్షకులు అనడంలో అతిశయోక్తి లేదు. 2013వ సంవత్సరం జనవరి 11న సంక్రాంతి కానుకగా ఈ చిత్రం విడుదల అయ్యింది. నేటితో ఈ చిత్రం విడుదలై 9 ఏళ్ళు పూర్తికావస్తోంది.
మరి బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం ఎంత కలెక్ట్ చేసిందో ఓ లుక్కేద్దాం రండి :
నైజాం
15.20 cr
సీడెడ్
6.50 cr
ఉత్తరాంధ్ర
3.80 cr
ఈస్ట్
3.78 cr
వెస్ట్
3.06 cr
గుంటూరు
3.58 cr
కృష్ణా
2.85 cr
నెల్లూరు
2.04 cr
ఏపీ + తెలంగాణ (టోటల్)
40.81 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా
5.52 Cr
ఓవర్సీస్
7.24 Cr
వరల్డ్ వైడ్ (టోటల్)
53.59 cr
‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ చిత్రానికి రూ.45.8 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఫుల్ రన్ ముగిసేసరికి ఈ చిత్రం రూ.53.59 కోట్ల షేర్ ను రాబట్టింది. ఫైనల్ గా బయ్యర్స్ కు ఈ చిత్రం రూ.7.79 కోట్ల లాభాలను అందించింది. అప్పటికి ‘దూకుడు’ ‘బిజినెస్మెన్’ వంటి చిత్రాలతో ఫామ్లో ఉన్న మహేష్ కు ఇది హ్యాట్రిక్ హిట్ గా నిలవగా.. ఇక వెంకటేష్ కెరీర్లో అత్యథిక కలెక్షన్లు నమోదు చేసిన చిత్రంగా ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ చిత్రం నిలిచింది.