SeetiMaarr: ఆ ఓటీటీలో విడుదలవుతున్న సీటీమార్!

టాలీవుడ్ డైరెక్టర్లలో ఒకరైన సంపత్ నంది డైరెక్షన్ లో తెరకెక్కి విడుదలైన సీటీమార్ అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. 12 కోట్ల రూపాయల టార్గెట్ తో గత నెలలో విడుదలైన ఈ సినిమా చాలా ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ అయింది. త్వరలో ఈ సినిమా ఓటీటీలో రిలీజ్ కానుంది. కబడ్డీ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా డిస్నీ + హాట్ స్టార్ లో దసరా కానుకగా రిలీజ్ కానుంది.

గోపీచంద్ కు జోడీగా ఈ సినిమాలో మిల్కీ బ్యూటీ తమన్నా నటించారు. సినిమాలో ఏపీ మహిళల కబడ్డీ కోచ్ పాత్రలో గోపీచంద్ నటించగా తెలంగాణ మహిళల కబడ్డీ కోచ్ పాత్రలో తమన్నా నటించారు. మణిశర్మ ఈ సినిమాకు మ్యూజిక్ అందించగా యాక్షన్, ఫన్ ఎలిమెంట్స్ తో ఈ సినిమా తెరకెక్కింది. ప్రముఖ నిర్మాత శ్రీనివాస్ చిట్టూరి ఈ సినిమాను నిర్మించారు. ఓటీటీలో ఈ సినిమా ఎలాంటి రెస్పాన్స్ ను అందుకుంటుందో చూడాల్సి ఉంది.

ఈ సినిమా క్లాస్, మాస్ ఆడియన్స్ కు నచ్చేలా ఉండగా ఈ మూవీతో గోపీచంద్ ఖాతాలో మరో హిట్ చేరడం గమనార్హం. థియేటర్లలో ఈ సినిమా చూసే అవకాశాన్ని మిస్సైన వారు ఓటీటీలో చూడవచ్చు. మరోవైపు తాజాగా గోపీచంద్ హీరోగా నటించి థియేటర్లలో విడుదలైన ఆరడుగుల బుల్లెట్ సినిమా ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేదు. ప్రస్తుతం గోపీచంద్ మారుతి డైరెక్షన్ లో పక్కా కమర్షియల్ సినిమాలో నటిస్తున్నారు. వచ్చే ఏడాది థియేటర్లలో ఈ సినిమా రిలీజ్ కానుంది.

కొండ పొలం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

సమంత- నాగచైతన్య మాత్రమే కాదు టాలీవుడ్లో ఇంకా చాలా మంది ఉన్నారు..!
‘రిపబ్లిక్’ మూవీలో గూజ్ బంప్స్ తెప్పించే డైలాగులు ఇవే..!
టాలీవుడ్ స్టార్ హీరోల ఇష్టమైన కార్లు..వాటి ధరలు

Share.