Sekhar Master: మళ్లీ పుంజుకుంటున్న శేఖర్ మాస్టర్
- January 21, 2026 / 07:19 PM ISTByDheeraj Babu
గతేడాది శేఖర్ మాస్టర్ క్రెడిబిలిటీకి “మిస్టర్ బచ్చన్, డాకు మహారాజ్” సినిమాలు డెంట్ పెట్టాయి. ఇదేంటి శేఖర్ మాస్టర్ ఇలాంటి స్టెప్పులు వేయిస్తున్నాడు అని తిట్టుకున్నవాళ్లు ఎక్కువే. ఆ తర్వాత కాస్త స్లో అయ్యాడు శేఖర్ మాస్టర్. వరుసబెట్టి సినిమాలు విడుదలవుతున్నా.. పాటలు పెద్దగా హైలైట్ అవ్వకపోవడంతో శేఖర్ మాస్టర్ బ్రాండ్ మీద డౌట్స్ మొదలయ్యాయి. అయితే.. వాటికి సమాధానం ఇస్తూ వరుసబెట్టి హిట్ సాంగ్స్ చేస్తున్నాడు శేఖర్ మాస్టర్.
Sekhar Master
ముఖ్యంగా ఈ సంక్రాంతికి విడుదలైన “భర్త మహాశయులకి విజ్ఞప్తి, అనగనగా ఒకరాజు” చిత్రాల్లో శేఖర్ మాస్టర్ కంపోజ్ చేసిన పాటలు హైలైట్ అవ్వడం అనేది విశేషం. ముఖ్యంగా #BMW సినిమాలో “వామ్మో వయ్యో” పాట విపరీతంగా వైరల్ అయ్యింది. ఆషిక రంగనాథ్ మాస్ స్టెప్పులు, రవితేజ ఎనర్జీ ఆ పాటని సినిమాకి హైలైట్ గా మార్చాయి. అలాగే.. “అనగనగా ఒక రాజు” సినిమాలో భీమవరం బాల్మా అనే పాట తాలూకు హుక్ స్టెప్స్ కూడా వైరల్ అయ్యాయి.

అయినా మధ్యలో వచ్చిన కొన్ని సాంగ్స్ తప్పితే.. దాదాపుగా శేఖర్ మాస్టర్ డ్యాన్స్ కంపోజ్ పాటలన్నీ బ్లాక్ బస్టర్లే. మరీ ముఖ్యంగా మహేష్ బాబులో మూమెంటం తీసుకొచ్చిన ఏకైక కొరియోగ్రాఫర్ గా శేఖర్ మాస్టర్ ను ఎప్పటికీ మహేష్ అభిమానులు గుర్తుంచుకుంటారు.

కొరియోగ్రాఫర్ గా కెరీర్ మొదలుపెట్టి దాదాపుగా 20 ఏళ్లు పూర్తి చేసుకున్న శేఖర్ మాస్టర్, ఇప్పటికీ ఇండస్ట్రీలో నెం.1 పొజిషన్ లో ఉండడం అనేది గమనార్హం. ఇలాగే కంటిన్యూ అయితే.. మరో పదేళ్లు శేఖర్ మాస్టరే నెంబర్ 1గా ఉంటాడు అనడంలోనూ ఎలాంటి సందేహం లేదు.











