బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్ నటించిన లేటెస్ట్ సినిమా ‘జెర్సీ’. తెలుగులో హిట్ అయిన ‘అర్జున్ రెడ్డి’ సినిమాను హిందీలో రీమేక్ చేసి అక్కడ భారీ విజయాన్ని అందుకున్న షాహిద్ కపూర్ ఇప్పుడు మరో తెలుగు రీమేక్ ని నమ్ముకున్నాడు. నేచురల్ స్టార్ నాని నటించిన ‘జెర్సీ’ సినిమాను అదే పేరుతో హిందీలో తెరకెక్కించారు దర్శకుడు గౌతమ్ తిన్ననూరి. క్రికెట్ నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో షాహిద్ కి జోడీగా మృణాల్ ఠాకూర్ నటించింది.
ఇప్పటికే పలుసార్లు వాయిదా వేస్తూ వచ్చిన ఈ సినిమా డిసెంబర్ 31న విడుదల చేయాలనుకున్నారు. అయితే ఇప్పుడు ఆ డేట్ ని కూడా పోస్ట్ పోన్ చేసినట్లు సమాచారం. ఈ విషయాన్ని ప్రముఖ క్రిటిక్ తరుణ్ ఆదర్శ్ తన ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ‘జెర్సీ’ సినిమా డిసెంబర్ 31న విడుదల కావడం లేదని.. కొత్త డేట్ ని త్వరలోనే ప్రకటిస్తారని తన ట్వీట్ లో రాసుకొచ్చారు. అలానే ఈ సినిమాను నేరుగా ఓటీటీలో రిలీజ్ చేస్తారనే రూమర్స్ పై స్పందించిన ఆయన..
అందులో నిజం లేదని పేర్కొన్నారు. ముంబై, ఢిల్లీలలో నైట్ కర్ఫ్యూ విధించడం కూడా ఈ వాయిదాకు ఒక కారణమని తెలుస్తోంది. కానీ ఇప్పుడు సినిమాను వాయిదా వేసుకుంటే.. ఫ్యూచర్ పరిస్థితులు మరింత దారుణంగానే మారే ఛాన్స్ ఉంది. అప్పుడు సినిమాను రిలీజ్ చేసుకోవడానికి డేట్ కూడా దొరకదేమో మరేం జరుగుతుందో చూడాలి. ఇక ఈ సినిమా స్టోరీ విషయానికొస్తే.. క్రికెటర్ గా చూడాలనుకున్న తన కొడుకు కోరికను తీర్చడానికి ఓ తండ్రి ఏం చేశాడనే కాన్సెప్ట్ తో సినిమా నడుస్తుంది.
36 ఏళ్ల వయసులో తిరిగి క్రికెట్ బ్యాట్ పట్టిన హీరోకి ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయనే సన్నివేశాలను చాలా ఎమోషనల్ గా ఉండబోతున్నాయి. ఇటీవల విడుదలైన ట్రైలర్ ను చూస్తుంటే.. తెలుగు ట్రైలర్ ను యాజిటీజ్ దించేసినట్లుగా ఉంది. సినిమా కూడా అలానే ఉంటుందేమో చూడాలి!