టాలీవుడ్ క్రేజీ హీరో శర్వానంద్ విడాకులు తీసుకోబోతున్నాడా? అంటే అవుననే టాక్ ఎక్కువగా వినిపిస్తుంది. 2023 జూన్ నెలలో శర్వానంద్.. రక్షిత రెడ్డి అనే అమ్మాయిని వివాహం చేసుకున్నాడు. రక్షిత రెడ్డి.. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు లాయర్ అయినటువంటి పసునూరు మధుసూదన్ రెడ్డి కుమార్తె అనే సంగతి చాలా మందికి తెలిసే ఉంటుంది. జైపూర్లోని లీలా ప్యాలెస్ లో శర్వానంద్- రక్షిత..ల వివాహం ఘనంగా జరిగింది. ఈ జంటకు ఓ పాప కూడా జన్మించింది.
అయితే కొన్నాళ్ల నుండి శర్వానంద్ – రక్షిత…లకి పడట్లేదని.. మనస్పర్థలు ఎక్కువవడం వల్ల విడాకులు తీసుకోవాలని డిసైడ్ అయినట్టు సమాచారం.
దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది. ఫ్యామిలీ లైఫ్ డిస్టర్బ్ అవ్వడం వల్ల శర్వానంద్ కూడా తన నెక్స్ట్ సినిమా షూటింగులకు దూరంగా ఉంటున్నాడట. ‘మనమే’ తర్వాత శర్వానంద్.. ‘లూజర్'(వెబ్ సిరీస్) దర్శకుడు అభిలాష్ రెడ్డితో ఒక యాక్షన్ అడ్వెంచర్ మూవీ చేస్తున్నట్లు ప్రకటించాడు.ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఈ సినిమా హోల్డ్ లో పడింది.
అలాగే రామ్ అబ్బరాజు దర్శకత్వంలో ‘నారి నారి నడుమ మురారి’ కూడా కంప్లీట్ చేయాలి. వీటితో పాటు సంపత్ నంది దర్శకత్వంలో ‘భోగి’ అనే సినిమా చేయడానికి కూడా రెడీ అయ్యాడు. వీటితో పాటు మరిన్ని కథలు విని కొంతమంది యంగ్ డైరెక్టర్స్ ను హోల్డ్ లో పెట్టాడు శర్వానంద్. ఇక పెండింగ్లో ఉన్న తన 3 ప్రాజెక్టులను 2026 సమ్మర్ నాటికి కంప్లీట్ చేస్తానని నిర్మాతలకు హామీ ఇచ్చాడట శర్వా.