Samyuktha Menon: షాకిస్తున్న సంయుక్త కొత్త సినిమా బడ్జెట్..!
- October 8, 2024 / 10:18 PM ISTByFilmy Focus
‘భీమ్లా నాయక్’ (Bheemla Nayak) ‘బింబిసార’ (Bimbisara) ‘సార్’ (Sir) ‘విరూపాక్ష’ (Virupaksha) వంటి వరుస విజయాలతో మంచి క్రేజ్ సంపాదించుకుంది సంయుక్త మీనన్ (Samyuktha Menon) . అయితే వీటి తర్వాత చేసిన ‘డెవిల్’ (Devil) అంతగా ఆడలేదు. అతిధి పాత్ర చేసిన ‘లవ్ మీ’ (Love Me) కూడా పెద్ద డిజాస్టర్ అయ్యింది. దీంతో సంయుక్త హవా కాస్త తగ్గిందని అంతా అనుకున్నారు. పైగా ఈ ఏడాది ఈమె నుండీ పెద్దగా సినిమాలు కూడా రాకపోవడంతో అది నిజమే అని అంతా ఫిక్స్ అయ్యారు.
Samyuktha Menon

కానీ ఆమె ఖాళీగా ఏమీ లేదు. ప్రస్తుతం ఈమె నిఖిల్ తో ‘స్వయంభు’ (Swayambhu) అనే పాన్ ఇండియా సినిమా చేస్తుంది. అలాగే శర్వానంద్ (Sharwanand) 37 వ సినిమాలోనూ, బెల్లంకొండ సాయి శ్రీనివాస్ (Bellamkonda Sai Sreenivas) 12 వ సినిమాలోనూ హీరోయిన్ గా నటిస్తుంది. ఇప్పుడు మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. వివరాల్లోకి వెళితే.. సంయుక్త మీనన్ ప్రధాన పాత్రలో ఓ సినిమా తెరకెక్కుతుంది. అంటే లేడీ ఓరియెంటెడ్ మూవీ అనమాట. రాజేష్ దండా (Rajesh Danda) ఈ చిత్రానికి నిర్మాత.

యోగేష్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. అక్టోబర్ 9న ఈ సినిమా లాంఛనంగా ప్రారంభం కానుందట. అందుతున్న సమాచారం ప్రకారం.. ఈ సినిమా కోసం ఏకంగా రూ.15 కోట్లు బడ్జెట్ పెడుతున్నారట నిర్మాత రాజేష్ దండా. బౌండ్ స్క్రిప్ట్ తో సెట్స్ పైకి వెళ్తుందట ఈ సినిమా. మరోపక్క ఈ సినిమాకి అప్పుడే రూ.3 కోట్ల ఓటీటీ ఆఫర్ కూడా రెడీగా ఉన్నట్లు తెలుస్తుంది. అయితే దానిని ఇంకా ఫైనల్ చేయలేదు అని టాక్.













