నిన్న జరిగిన ‘డ్రాగన్’ (Dragon) ప్రీ రిలీజ్ ఈవెంట్ కి హరీష్ శంకర్ (Harish Shankar) గెస్ట్ గా వచ్చాడు. అఫ్ కోర్స్.. ఎక్కువగా ప్రీ రిలీజ్ లేదా సక్సెస్ మీట్లకి హాజరయ్యే దర్శకుడు ఇతనే. స్నేహితుల మాట తీసేయకుండా వచ్చి.. అక్కడికి వచ్చిన జనాల్లో తన మాటలతో జోష్ ని నింపుతూ ఉంటాడు. పైగా హరీష్ స్పీచ్ ఇచ్చే విధానం కూడా చాలా బాగుంటుంది. అయితే నిన్న అతను మాట్లాడుతూ.. ” ‘లవ్ టుడే’ (Love Today) సినిమాతో ప్రదీప్ రంగనాథన్ (Pradeep Ranganathan) దర్శకుడిగా మారాడు.
తమిళంలో కాబట్టి వర్కౌట్ అయ్యింది. తెలుగులో ఇలా హీరోల డేట్ల కోసం వెయిట్ చేసి ఫ్రస్ట్రేషన్ తో హీరో కావాలనుకోవడం కుదరదు” అన్నట్టు కామెంట్స్ చేశాడు. నిజమే.. హీరో ఎవరో తెలీకపోయినా వేరే భాషల్లో రూపొందే సినిమాలను మన తెలుగు ప్రేక్షకులు చూస్తారు. కానీ హరీష్ కి కూడా హీరోగా చేయాలని ఉందేమో. అతను చేస్తే ఇక్కడ జనాలు చూడరు అనేది అతని భయం కావచ్చు. అందుకే అతను అలా అని ఉంటాడు.
అంతేకాదు.. స్పీచ్ ముగించే ముందు కూడా ‘మన సినిమాలు తప్ప మిగిలిన అన్ని భాషల్లో రూపొందే సినిమాలు కచ్చితంగా చూస్తాం కదా..! శుక్రవారం వచ్చేయండి ‘డ్రాగన్’ చూద్దాం’ అని అన్నాడు. నిజమే అందులో కూడా తప్పు లేదు. మన తెలుగు ప్రేక్షకులు కంటెంట్ బాగుంది అంటే చాలు.. హీరో ఎవరు అని చూడకుండా థియేటర్ కి వెళ్లి పక్క భాషల సినిమాలని కూడా చూస్తారు.
హిట్లు.. సూపర్ హిట్లు.. బ్లాక్ బస్టర్స్ ని చేస్తారు. అలా అని తెలుగు సినిమాలను తక్కువ చేయరు. బహుశా.. హరీష్ కామెంట్స్ లో ఈ సింక్ మిస్ అయినట్టు ఉంది. అందుకే కొంతమంది అతన్ని టార్గెట్ చేసి నానా మాటలు అంటున్నారు.