ఈ మధ్య కాలంలో ఓ పెద్ద సినిమా ప్లాప్ అయితే.. వెంటనే డిస్ట్రిబ్యూటర్లు దర్శకనిర్మాతల ఇంటి ముందు ధర్నాలు చేయడం అనేది పెద్ద షో అయిపోయింది. ఈ విషయంలో పూరి జగన్నాథ్ ఏడాది కాలంగా ఇబ్బందులు పడుతూనే ఉన్నాడు. ఆయన తెరకెక్కించిన ‘లైగర్’ సినిమా నిరాశపరిచింది. అది భారీ బడ్జెట్ తో రూపొందిన సినిమా. థియేట్రికల్ రైట్స్ రూ.80 కోట్ల వరకు వెళ్లాయి. కానీ తిరిగొచ్చింది రూ.25 కోట్లు మాత్రమే.
సరే బయ్యర్స్ నష్టపోయారు. అందుకు పూరిని డిస్ట్రిబ్యూటర్లు వేధిస్తున్నారు. దానికి ఓ రీజన్ ఉంది. ఎందుకంటే పూరి ‘లైగర్’ కు ఓ నిర్మాత కాబట్టి. ఛార్మితో, కరణ్ జోహార్ తో కలిసి అతను ఆ సినిమాను నిర్మించాడు. అతను కోట్ చేసిన రేట్లకు బయ్యర్స్ వచ్చి సినిమాని కొనుక్కున్నారు. ఆ టైంలో ఇంతింత రేట్లు ఏంటి? అని ప్రశ్నించి వెనక్కి తగ్గొచ్చు కదా. అప్పుడు పూరి.. ఓన్ రిలీజ్ చేసుకునే ప్రయత్నం చేసుకునే వాడు. కానీ బయ్యర్స్ అలా తగ్గలేదు.
సినిమాకి డబుల్ ప్రాఫిట్స్ వస్తాయని ఆశించారు. హిట్ అయితే వచ్చేవేమో. కానీ రాలేదు. ఒకవేళ ప్రాఫిట్స్ వస్తే.. బయ్యర్స్ పూరికి వాటా ఇస్తారా? అంటే కచ్చితంగా అవునని చెప్పలేం. సరే.. పూరి సంగతి పక్కన పెట్టేద్దాం. తాజాగా డిస్ట్రిబ్యూటర్స్ ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే .. ‘ఆచార్య’ సినిమా ప్లాప్ అయితే చిరు, చరణ్ లు తమ పారితోషికం వెనక్కి ఇచ్చేసి డిస్ట్రిబ్యూటర్లను ఆదుకున్నారు. కాబట్టి విజయ్ కూడా పారితోషికం వెనక్కి ఇవ్వాలి అని ఇప్పుడు డిమాండ్ చేయడం మొదలుపెట్టారు.
(Vijay Devarakonda) విజయ్.. ‘లైగర్’ సినిమాకి నిర్మాత కాదు. పైగా ‘లైగర్’ కోసం విజయ్ పారితోషికం కూడా పూర్తిగా తీసుకోలేదు. ఈ విషయాన్ని పూరి కూడా ప్రీ రిలీజ్ ఈవెంట్లో చెప్పుకొచ్చాడు. అప్పుడు అతను పారితోషికం వెనక్కి ఎలా ఇవ్వగలడు. పైగా ప్రమోషన్ కోసం 30 రోజులు పైనే కాల్ షీట్లు ఇచ్చాడు. ఆ గ్యాప్లో ఓ సినిమా కంప్లీట్ చేసుకుని అతను క్యాష్ చేసుకోవచ్చు. విజయ్ అలా చేయలేదు కదా. ‘లైగర్’ కోసం అతను చేయాల్సింది అంతా చేశాడు. కాబట్టి.. విజయ్ ను ఈ ఇష్యులోకి లాగడం సరైనది కాదనే చెప్పాలి.