‘రాధేశ్యామ్’ ప్రమోషన్స్ విషయంలో చాలా శ్రద్దగా వ్యవహరిస్తూ వస్తున్నారు మేకర్స్.ముఖ్యంగా మ్యూజిక్ విషయంలో..! ‘సాహో’ మ్యూజిక్ విషయంలో చాలా విమర్శలు ఎదుర్కొన్నారు నిర్మాతలు. అసలు ఆ సినిమాకి సంగీత దర్శకుడు ఎవరంటే..? ఇప్పటికీ చెప్పలేని అయోమయంలో జనాలు ఉన్నారు. తెలుగులో ఆ చిత్రం ఘోరపరాజయం పాలవ్వడానికి ప్రధాన కారణం అదే అని చాలా మంది మనసులోని మాట. అందుకే ‘రాధే శ్యామ్’ పాటల విషయంలో చాలా శ్రద్ద పెట్టారు. జస్టిన్ తెలుగులో సంగీతం అందిస్తున్నాడు.
హిందీలో మాత్రం మిథున్, ఆర్జిత్ సింగ్ లు సంగీతం అందిస్తున్నారు. తెలుగు వెర్షన్ లో ఉన్న పాటలు, హిందీ వెర్షన్ లో ఉండవట. అందుకే వేర్వేరు సంగీత దర్శకులు పని చేస్తున్నారు. పాట … నటులు …డ్యాన్స్ …సేమ్ ఉంటుంది కానీ ట్యూన్స్ వేరు. ఈరోజు విడుదలైన ‘ఆషికీ ఆ గయీ’ అనే హిందీ పాటని విడుదల చేశారు. కానీ తెలుగులో ఈ పాట ‘నగుమోము తారలే’ గా రానుంది. జస్టిన్ ప్రభాకరన్ తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగినట్టు ట్యూన్ మారుస్తున్నాడు.
అయితే ఆల్రెడీ హిందీ వినేసారు ప్రేక్షకులు. ఇక్కడి జనాలకి అది బాగా ఎక్కేసింది. మరి తెలుగులో ఈ పాట ప్రేక్షకుల్ని మెప్పిస్తుందా లేక హిందీనే బాగుంది అనేస్తారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. చూడాలి మరి నిర్మాతలు దీనిని ఎలా ప్లాన్ చేసారో?