సినిమాలను చూసే విషయంలో టాలీవుడ్ ప్రేక్షకుల అభిరుచి పూర్తిస్థాయిలో మారిపోయింది. సినిమాకు యునానిమస్ పాజిటివ్ టాక్ వస్తే మాత్రమే ప్రేక్షకులు థియేటర్లలో సినిమా చూసే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. 2023 సంక్రాంతి పండుగకు ఏకంగా ఐదు సినిమాలు థియేటర్లలో విడుదల కానున్నాయి. ఈ ఐదు సినిమాలలో నటించిన హీరోలు క్రేజ్ ఉన్న హీరోలే కావడం గమనార్హం. ఐదు సినిమాలకు సమానంగా థియేటర్లను కేటాయించినా గరిష్టంగా ఒక్కో హీరో సినిమాకు 400 థియేటర్లు మాత్రమే దొరికే ఛాన్స్ అయితే ఉంది.
సంక్రాంతి పండుగ సమయానికి మరికొన్ని సినిమాలు రేసులోకి వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. 400 థియేటర్లలో సినిమా రిలీజైతే ఆ సినిమాకు కలెక్షన్లు కూడా భారీగా తగ్గే ఛాన్స్ అయితే ఉంది. ఈ విషయాలను, నిర్మాతల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని కనీసం రెండు పెద్ద సినిమాలు సంక్రాంతి రేసు నుంచి తప్పుకుంటే మంచిదని చెప్పవచ్చు. అలా జరగని పక్షంలో యునానిమస్ పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకున్న రెండు సినిమాలు మినహా మిగతా సినిమాల నిర్మాతలకు భారీ నష్టాలు తప్పవు.
దాదాపుగా 800 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కిన 5 సినిమాలు సంక్రాంతికి విడుదలైతే ఆ రేంజ్ లో కలెక్షన్లను సాధించడం సాధ్యం కాదు. వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య, ఆదిపురుష్, ఏజెంట్, వారసుడు సినిమాలు సంక్రాంతికి కానుకగా రిలీజ్ కానున్న నేపథ్యంలో ఏం జరుగుతుందో చూడాల్సి ఉంది. ఈ సినిమాలలో వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య మాస్ యాక్షన్ సినిమాలు కాగా ఈ సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితాలను అందుకుంటాయో చూడాలి. చిరంజీవి, బాలయ్య సినిమాలు ఐదేళ్ల తర్వాత బాక్సాఫీస్ వద్ద పోటీ పడనున్నాయి.