రెబల్ స్టార్ కృష్ణంరాజు ఈ నెల 11వ తేదీన ఉదయం 3.25 గంటలకు అనారోగ్య సమస్యల వల్ల కన్నుమూశారనే సంగతి తెలిసిందే. అయితే కృష్ణంరాజు గురించి వెలుగులోకి వస్తున్న ఎన్నో కొత్త విషయాలు నెటిజన్లను ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. అతిథులకు మర్యాద ఇవ్వడంలో, ఇతరులను గౌరవించడంలో కృష్ణంరాజుకు ఎవరూ సాటిరారనే సంగతి తెలిసిందే. గతంలో ఒక సందర్భంలో కృష్ణంరాజు తన జీవితానికి సంబంధించిన కీలక విషయాలను పంచుకున్నారు. కృష్ణంరాజుకు స్టిల్ ఫోటోగ్రఫీ అంటే అంటే ఎంతో ఇష్టం కాగా తను తీసిన ఫోటోల ద్వారా ఆయన బహుమతులు గెలుచుకున్న సందర్భాలు ఉన్నాయి.
నాన్న తప్పు జరిగితే మాత్రం సహించేవారు కాదని 16 సంవత్సరాల వయస్సులో ఒక వ్యక్తి నాన్న కోసం వచ్చాడని ఆ సమయంలో నేను బల్లపై కాళ్లు పెట్టుకుని ఊపుతూ అతిథిని గౌరవించలేదని కృష్ణంరాజు కామెంట్లు చేశారు. ఇంటికి వచ్చిన వ్యక్తి అడిగిన ప్రశ్నలకు కూర్చునే జవాబులు ఇచ్చానని కృష్ణంరాజు అన్నారు. నేను అలా చేయడం బయటినుంచి వచ్చిన నాన్న గమనించి గోడకు తగిలించి ఉన్న కొరడాతో నన్ను చితకబాదారని ఆయన తెలిపారు.
ఆ దెబ్బల వల్ల ఐదురోజులు నేను మంచానికే పరిమితం అయ్యానని కృష్ణంరాజు చెప్పుకొచ్చారు. ఎదుటివారిని గౌరవించాలనే సూత్రం అప్పుడే నాకు ఒంటబట్టిందని ఆయన తెలిపారు. యోగా, కబడ్డీ అంటే కృష్ణంరాజుకు చాలా ఇష్టం. ఆటల గురించి కృష్ణంరాజు చెబుతూ ఆటలు ఆడే సమయంలో నేనెప్పుడూ దురుసుగా ప్రవర్తించలేదని అన్నారు. రైడింగ్ కు వెళ్లే సమయంలో ప్రత్యర్థిని ఓడించటానికి
చాలామంది గట్టిగా కొడతారని అయితే నేను మాత్రం ముక్కుమీద వేలుతో తాకి వచ్చేవాడినని అది అంపైర్ కు కూడా కనిపించేది కాదని ఆయన అన్నారు. అలాగే ఆటను ఆడటం వల్ల నాకు నా స్నేహితులు ముక్కురాజు అనే బిరుదును ఇచ్చారని ఆయన చెప్పుకొచ్చారు. సినిమాసినిమాకు వైవిధ్యం చూపి కృష్ణంరాజు నటుడిగా ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు.