సూపర్ స్టార్ కృష్ణ 80వ సంవత్సరాల వయస్సులో కూడా ఆరోగ్యంగా ఉన్నారనే సంగతి తెలిసిందే. సినిమాలకు, రాజకీయాలకు దూరంగా ఉన్న కృష్ణ మహేష్ బాబు సినిమాలు విడుదలైతే మాత్రం ఆ సినిమాలను మరింత ప్రమోట్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. అయితే తాజాగా కృష్ణ తన ఆహారపు అలవాట్ల గురించి, ఆరోగ్య రహస్యాల గురించి చెప్పుకొచ్చారు. తాను పని లేకుండా బయటకు వెళ్లనని ఎక్కువగా రెస్ట్ తీసుకుంటానని ఆయన చెప్పారు. కొన్ని దశాబ్దాలుగా తన బరువు 76,77 కిలోలని తన బరువు ఎప్పటికీ మారదని ఆయన వెల్లడించారు.
దేవుడి దయ వల్లే ఒకే బరువుతో ఉన్నానని ఇందుకోసం తాను ప్రత్యేకంగా వ్యాయామాలు చేయడం, జాగ్రత్తలు తీసుకోవడం చేయనని ఆయన చెప్పుకొచ్చారు. ప్రస్తుతం తాను ఖాళీగా ఉన్నానని అందువల్ల యోగా, వాకింగ్ చేయగలుగుతున్నానని కృష్ణ చెప్పుకొచ్చారు. సినిమాలు చేసే సమయంలో వర్క్ చేయడమే వ్యాయామంగా ఉండేదని కృష్ణ చెప్పుకొచ్చారు. తాను రోజుకు 17 గంటలు పని చేసిన రోజులు ఉన్నాయని అల్లూరి సీతారామరాజు సినిమా విడుదలయ్యే వరకు తాను అదే విధంగా పని చేశానని కృష్ణ కామెంట్లు చేశారు.
అయితే అల్లూరి సీతారామరాజు తర్వాత ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే పని చేసేవాడినని ఆయన చెప్పుకొచ్చారు. దశాబ్దాల నుంచి ఇదే నా వ్యాయామమని ఆయన కామెంట్లు చేశారు. నిద్రలేచిన వెంటనే లీటర్ మంచి నీళ్లు తాగుతానని ఆ తర్వాత గంట సమయం గ్యాప్ ఇచ్చి జ్యూస్ తాగుతానని స్నానం చేసిన తర్వాత టిఫిన్ తింటానని కృష్ణ వెల్లడించారు. ఇడ్లీ, దోశ తాను ఇష్టంగా తింటానని కృష్ణ అన్నారు.
ఉదయం 11 గంటల సమయంలో మజ్జిగ తాగి మధ్యాహ్నం ఫుల్ గా భోజనం తింటానని సాయంత్రం జున్ను, రాత్రికి చపాతి చికెన్ కర్రీ తింటానని కృష్ణ అన్నారు. తను హీరోగా నటించే సమయంలో క్యారవాన్లు లేవని కృష్ణ చెప్పుకొచ్చారు.