మెగాబ్రదర్ నాగబాబు.. చిరంజీవి పెద్ద తమ్ముడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు.అప్పటి స్టార్ డైరెక్టర్ కోదండరామిరెడ్డి చిరంజీవితో తెరకెక్కించిన ‘రాక్షసుడు’ చిత్రం ద్వారా నటుడిగా పరిచయమయ్యాడు నాగబాబు. తరువాత అన్నయ్య పలుకుబడి ఉపయోగించుకుని కొన్ని సినిమాల్లో హీరోగా నటించినా..సక్సెస్ కాలేకపోయాడు. ఈ క్రమంలో ‘అంజనా ప్రొడక్షన్స్’ నిర్మాణ సంస్థను స్థాపించి నిర్మాతగా కూడా మారాడు. మొదటి ప్రయత్నంగా ‘రుద్రవీణ’ సినిమాను నిర్మించాడు. కే.బాలచందర్ డైరెక్షన్లో తెరకెక్కిన ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకున్నప్పటికీ కమర్షియల్ సక్సెస్ అనిపించుకోలేకపోయింది.అటు తరువాత కూడా తన అన్నయ్యతో ‘త్రినేత్రుడు’ ‘ముగ్గురు మొనగాళ్లు’ ‘బావగారు..బాగున్నారా’ ‘స్టాలిన్’ వంటి సినిమాలను నిర్మించాడు.
వీటిలో ‘ముగ్గురు మొనగాళ్ళు’ ‘బావగారు బాగున్నారా’ చిత్రాలు తప్ప అన్నీప్లాపులే. ఇక పవన్ తో చేసిన ‘గుడుంబా శంకర్’, రామ్ చరణ్‌తో చేసిన ‘ఆరెంజ్’, అల్లు అర్జున్ తో చేసిన ‘నా పేరు సూర్య’ వంటి సినిమాలు కూడా నాగబాబుకి నష్టాలనే మిగిల్చాయి. ‘ఆరెంజ్’ సినిమా వల్ల వచ్చిన నష్టాలకు ఏకంగా సూసైడ్ చేసుకోవాలి అని డిసైడ్ అయినట్టు’.. నాగబాబు పలు ఇంటర్వ్యూలలో చెప్పుకొచ్చాడు.అయితే నాగబాబు దగ్గర ఇప్పుడు వంద కోట్ల ఆస్తి ఉందనే వార్త రావడంతో అందరూ షాక్ కు గురయ్యారు. ‘జబర్దస్త్’ ‘అదిరింది’ వంటి షో లతో నాగబాబు బాగానే వెనకేసుకున్నాడని తెలుస్తుంది.ఈ షోల ద్వారా సంపాదించిన డబ్బుని నాగబాబు రియల్ ఎస్టేట్ బిజినెస్ లో పెట్టినట్టు తెలుస్తుంది.
బ్యాంక్ లో దాచుకోవడం కంటే.. రియల్ ఎస్టేట్ రూపంలో దాచుకున్న డబ్బుకి ఎటువంటి ఢోకా ఉండదు అనేది అతని ప్లాన్ కావచ్చు.గతేడాది జరిగిన ఎన్నికల్లో ‘జనసేన’ తరుపున నరసాపురం ఎంపీ సీట్ కు పోటీ చేసాడు నాగబాబు. ఆ టైములో తనకు, తన భార్యకు కలిపి రూ.41 కోట్ల వరకూ ఆస్తులు ఉన్నట్టు చూపించాడు నాగబాబు. ముఖ్యంగా వాహనాలు వంటి చరాస్థుల రూపంలో 36.73 కోట్ల వరకూ ఉన్నట్టు స్పష్టమయ్యింది. ఇక స్థిరాస్థులు 4.22 కోట్లు,అలాగ 2.70 కోట్ల అప్పు ఉన్నట్లు కూడా చూపించారు.ఈ విధంగా చూస్తే.. నాగబాబు ఆస్తి 38 కోట్లు కాగా… మార్కెట్ వాల్యూ ప్రకారం .. రూ.100 కోట్ల పైనే ఉంటుందని తెలుస్తుంది.