కైకాల సత్యనారాయణ.. ఈయన గురించి ఇప్పటి ప్రేక్షకులకు పెద్దగా తెలిసుండకపోవచ్చు కానీ.. అప్పటి ప్రేక్షకులకు మాత్రం ఈయన సుపరిచితుడే. ఈ మధ్య కాలంలో ఈయన మహేష్ బాబు ‘మహర్షి’ చిత్రంలో కనిపించాడు. అందులో హీరోయిన్ పూజా హెగ్డే తాతయ్య పాత్రను పోషించాడు కైకాల సత్యనారాయణ. అంతేకాదు ‘కె.జి.ఎఫ్ చాప్టర్1’ చిత్రానికి సహా నిర్మాతగా కూడా వ్యవహరించారు..! అప్పట్లో ఎస్.వి.రంగారావు గారు అంత కాకపోయినా.. ఆ తరహా ఇమేజ్ ను సొంతం చేసుకున్నారు కైకాల.
ఎన్నో పౌరాణిక, సాంఘిక, చారిత్రక, జానపద.. చిత్రాల్లో అద్భుతమైన పాత్రలను పోషించాడు. 1959 లో ‘సిపాయి కూతురు’ అనే చిత్రంతో ఇండస్ట్రీకి పరిచయం అయిన కైకాల సత్యనారాయణ… అటు తరువాత ఈయన అప్పటి స్టార్ హీరో ఎన్టీఆర్ కు డూప్ గా ఎన్నో చిత్రాలు చేశాడట. మంచి హైటు, అందం ఉన్న కైకాల గారు కచ్చితంగా హీరో అవుతాడని.. స్టార్ గా ఎదుగుతాడని.. అప్పట్లో చాలా మంది రచయితలు చెప్పేవారట.
ఈయన డెడికేషన్ కూడా చుడముచ్చటగా ఉండేదట. వారు చెప్పినట్టు గానే పలు ప్రాజెక్టుల్లో ఈయన్ని హీరోగా కూడా ఎంచుకున్నారట దర్శక నిర్మాతలు. అయితే కారణాలు ఏంటో తెలీదు కానీ.. ఈయన హీరోగా చెయ్యాల్సిన సినిమాల నుండీ ఈయన్ని తప్పించారట. మరికొన్ని సినిమాల్లో అయితే నెగిటివ్ రోల్స్ కు ఈయన్ని షిఫ్ట్ చేశారట.దానికి గల కారణాలు ఏంటి అన్నది ఇప్పటికీ సస్పెన్స్ అని తెలుస్తుంది.