నేచురల్ స్టార్ నాని (Nani) హీరోగా శ్రీకాంత్ ఓదెల (Srikanth Odela) దర్శకత్వంలో ‘ది పారడైజ్’ (The Paradise) అనే సినిమా రూపొందనుంది. ఆల్రెడీ అధికారిక ప్రకటన వచ్చింది. ఈరోజు గ్లింప్స్ ను కూడా వదిలారు. ‘ఎస్.ఎల్.వి సినిమాస్’ అధినేత సుధాకర్ చెరుకూరి (Sudhakar Cherukuri) ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు. ఆయన కెరీర్లో ‘దసరా’ తప్ప మరో హిట్టు లేదు. ‘దసరా’ (Dasara) తర్వాత వచ్చిన ‘రంగబలి’ (Rangabali) వంటి సినిమాలు కూడా ఆడలేదు. మరోపక్క బాలకృష్ణ (Nandamuri Balakrishna), చిరంజీవి (Chiranjeevi) వంటి హీరోలతో కూడా ఆయన సినిమాలు సెట్ చేసుకుంటున్నారు.
అన్నీ ఎలా ఉన్నా ‘ది పారడైజ్’ సినిమాకు రూ.100 కోట్ల వరకు బడ్జెట్ పెట్టాల్సి ఉందట. సో ఇప్పుడు అంత మొత్తం బడ్జెట్ నానిపై పెట్టాలంటే కొంచెం రిస్క్ తో కూడిన పని. అందుకోసమే ‘ది పారడైజ్’ గ్లింప్స్ వదిలారు. ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ ఇంకా మొదలవ్వలేదు. కేవలం బజ్ కోసం.. ప్రీ రిలీజ్ బిజినెస్ కోసం ఏఐ సాయంతో ‘ది పారడైజ్’ గ్లింప్స్ రెడీ చేసినట్లు తెలుస్తుంది.
ఈ విషయాలు పక్కన పెట్టేస్తే.. ‘ది పారడైజ్’ గ్లింప్స్ లో నాని చేతిపై ‘ల*జ కొడక’ అనే టాటూ ఉంది. దీనిని ఇప్పుడు ట్రోలింగ్ మెటీరియల్ గా వాడుకుంటున్నారు కొంతమంది నెటిజన్లు. గతంలో నాని హీరోగా హను రాఘవపూడి (Hanu Raghavapudi) దర్శకత్వంలో ‘కృష్ణగాడి వీరప్రేమగాధ’ (Krishna Gaadi Veera Prema Gaadha) సినిమా వచ్చింది. ఆ సినిమాలో నాని చేతిపై ‘బాలయ్య’ అనే టాటూ ఉంటుంది.
ఇప్పుడు చేస్తున్న ‘ది పారడైజ్’ లో ‘ల*జ కొడక’ అని ఉంది. దీనిని ఓ స్టార్ హీరోకి లింక్ చేస్తూ ట్రోల్ చేస్తున్నారు.. ఆ స్టార్ హీరో అభిమానులు. నాని టాటూలు ఆ ఇద్దరి హీరోలను ట్రోల్ చేయడానికి బాగా పనిచేస్తుంది అంటూ దారుణమైన కామెంట్లు చేస్తున్నారు. సోషల్ మీడియాలో స్టార్ హీరోలపై ట్రోలింగ్ కామన్. కానీ వాటి కోసం ఇంత దారుణమైన క్రియేటివిటీ అవసరం లేదు అనేది కొందరి వాదన.
Then : Nani tattooed NBK’s Name On His Hand
Now : Nani Tattooed VD’s Name On His Hand #TheParadise pic.twitter.com/7bSOchqk26
— Nanii!! (@narasimha_chow2) March 3, 2025