ట్రాఫిక్ పోలీసులు తన అభిమానులను పట్టుకొన్నప్పుడు వాళ్ళకి బదులుగా.. తాను సారీ చెప్పడం, “నోటా” సినిమా ఫ్లాప్ అనే విషయాన్ని స్వయంగా ఒప్పుకోవడం, తనకు పోటీ అయిన స్టార్ హీరోలు లేదా యంగ్ హీరోల సినిమాల రిలీజ్ టైమ్ లో వాళ్ళని, వాళ్ళ సినిమాలను సపోర్ట్ చేస్తూ పోస్ట్ లు పెట్టడం వంటివి చూసి.. “అబ్బో విజయ్ దేవరకొండ అందరిలాంటివాడు కాదు” అనుకొన్నారు అందరూ. కానీ.. తానేమీ ప్రత్యేకమైన వాడ్ని కాదని, తాను కూడా అందరి లాంటి వాడిననే విషయాన్ని ప్రూవ్ చేసుకొన్నాడు విజయ్ దేవరకొండ.
“దొరసాని” ప్రీరిలీజ్ ఈవెంట్ టైమ్ లోనే సినిమాకి సపోర్ట్ చేస్తూ.. “గర్వపడ్డాను” అని చెప్పడంతో సినిమా మీద మంచి అంచనాలు పెరిగాయి. దాంతో సినిమా కనీస స్థాయిలో ఉంటుందిలే అనుకోని థియేటర్లకి వెళ్ళిన వాళ్ళలో 90%పైగా జనాలు “ఇదేం సినిమారా బాబు” అనుకుంటూ థియేటర్ నుంచి బయటకు వచ్చారు. చాలా తక్కువ మంది మాత్రమే సినిమాలోని తెలంగాణ యాసను మెచ్చుకొన్నారు. సో, నిజం మాత్రమే మాట్లాడుతాను, అబద్ధం చెప్పడం రాదు అని గొప్పలు పోయే విజయ్ దేవరకొండ కూడా తమ్ముడి విషయంలో లేకిగానే వ్యవహరించడం చర్చనీయాంశం అయ్యింది.