Siddu Jonnalagadda: ప్లాప్ దర్శకుడికి ఛాన్స్ ఇస్తున్న సిద్దు జొన్నలగడ్డ.!
- October 8, 2024 / 08:14 PM ISTByFilmy Focus
మహేష్ బాబు (Mahesh Babu) వంటి స్టార్ హీరోతో ‘సర్కారు వారి పాట’ (Sarkaru Vaari Paata) చేసిన పరశురామ్ (Parasuram) .. ఆ సినిమాతో పర్వాలేదు అనిపించే రిజల్ట్ అందుకున్నాడు కానీ బ్లాక్ బస్టర్ డెలివరీ చేయలేదు. అందువల్ల మళ్ళీ విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) వంటి టైర్2 హీరోతో ‘ఫ్యామిలీస్టార్’ (Family Star) చేసుకోవాల్సి వచ్చింది. పోనీ ఏదైనా హిట్ అయ్యిందా అంటే..లేదు. అటు విజయ్ దేవరకొండ కెరీర్లోనూ.. ఇటు పరశురామ్ కెరీర్లోనూ పెద్ద ప్లాప్ గా మిగిలింది. దీంతో మిగిలిన హీరోలు ఎవ్వరూ కూడా పరశురామ్ కి ఛాన్స్ ఇవ్వలేకపోతున్నారు.
Siddu Jonnalagadda

అయితే గతేడాది చివర్లో కార్తీకి ఓ కథ వినిపించాడు పరశురామ్.దాదాపు ఈ ప్రాజెక్టు ఓకే అనుకున్నారు. కానీ వర్కౌట్ అవ్వలేదు. పరశురామ్ తో ఓ సమస్య ఉంది. ఓ హీరో ఛాన్స్ ఇచ్చినప్పటికీ.. ఈలోగా ఇంకో పెద్ద ఆఫర్ వస్తే, వాళ్ళ దగ్గరకు వెళ్ళిపోతూ ఉంటాడు. బహుశా ‘ఫ్యామిలీ స్టార్’ కి వెళ్లడంతో కార్తీ (Karthi) హర్ట్ అయ్యాడనే టాక్ ఉంది. అందుకే పరశురామ్ కథని ఓకే చేయకుండా అతను ‘ఖైదీ 2’ (Kaithi) కి ఓకే చెప్పినట్లు తెలుస్తుంది.

ఈ క్రమంలో పరశురామ్.. సిద్దు జొన్నలగడ్డతో (Siddu Jonnalagadda) సినిమా సెట్ చేసుకున్నట్టు టాక్ నడుస్తుంది. సిద్దు జొన్నలగడ్డ ప్రస్తుతం మంచి ఫామ్లో ఉన్నాడు. ‘టిల్లు స్క్వేర్’ (Tillu Square) తో అతను రూ.100 కోట్ల క్లబ్లో చేరాడు. ప్రస్తుతం వరుస సినిమాల్లో నటిస్తున్న సిద్ధు.. ‘మిస్టర్ బచ్చన్’ (Mr. Bachchan) వంటి సినిమాల్లో గెస్ట్ రోల్స్ కూడా చేస్తున్నాడు.అలాగే మరోపక్క కథలు కూడా వింటున్నాడు.

దిల్ రాజు (DJ Tillu) బ్యానర్‌లో ఓ సినిమా చేయడానికి సిద్ధు ఓకే చెప్పాడు. ఇందులో భాగంగా దర్శకుడు పరశురామ్ చెప్పిన కథకి ఓకే చెప్పినట్టు సమాచారం. కార్తీతో చేయాల్సిన కథే ఇప్పుడు పరశురామ్(బుజ్జి) సిద్దూతో చేయబోతున్నట్టు టాక్ వినిపిస్తుంది. ఇందులో ఎంతవరకు నిజముందో తెలియాల్సి ఉంది.















