నందమూరి వారసులు, మెగా వారసులు.. ఈ పోరు ఇప్పటిది కాదు. ఇటు బాలకృష్ణ, అటు చిరంజీవి చాలా ఏళ్లుగా బాక్సాఫీసు దగ్గర పోరాడుతూనే ఉన్నారు. చిరంజీవి వారసుడు రామ్‌చరణ్ సినిమాల్లోకి వచ్చేసి.. తనను తాను నిరూపించుకున్నాడు కూడా. నందమూరి వారసుడు ఇంకా రావాల్సి ఉంది. అయితే ఇద్దరు వారసుల్లో ఓ కామన్ పాయింట్ ఉంది తెలుసా? ఇంకా ఇండస్ట్రీలోకి రాని మోక్షజ్ఞ, ఇండస్ట్రీలోకి ఆల్ రెడీ వచ్చేసిన రామ్‌చరణ్ మధ్య ఏంటా కామన్ పాయింట్ అనుకుంటున్నారా?
అవును, ఇద్దరి మధ్య కామన్ పాయింట్ ఉన్నది నిజమే. అదేదో కాదు.. ఇద్దరి పేర్లే. అవును ఇద్దరి పేర్లలో ఓ కామన్ పాయింట్ ఉంది. ఇటీవల ‘తారకరామ’ థియేటర్ ప్రారంభోత్సవం సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ మోక్షజ్ఞ పూర్తి పేరు చెప్పారు. దీంతో ఈ కామన్ పాయింట్ అనేది బయటకు వచ్చింది. థియేటర్ ప్రారంభం అనంతరం బాలకృష్ణ మాట్లాడుతూ ‘‘తారకరామ థియేటర్‌కి ఓ చరిత్ర ఉంది. అమ్మానాన్నల పేర్లు కలిసి వచ్చేలా కట్టిన ఓ దేవాలయం ఇది.
మా అబ్బాయి మోక్షజ్ఞ తారకరామ తేజ నామకరణాన్ని నాన్న ఈ థియేటర్లోనే చేశారు’’ అని వెల్లడించారు. అర్థమైందిగా మేటర్.. మోక్షజ్ఞ పూర్తి పేరు మోక్షజ్ఞ తారకరామ తేజ. ఇటు రామ్ చరణ్ పూర్త పేరు రామ్‌చరణ్‌తేజ్. ఇద్దరి పేర్లలో తేజ అనేది కామన్‌గా ఉందన్నమాట. అయితే చరణ్‌ను అందరూ పూర్తి పేరుతో కాకుండా రామ్‌చరణ్ అంటారు, ముద్దుగా చెర్రీ అని కూడా అంటారు. అలా మోక్షజ్ఞ తారకరామ తేజను మోక్షజ్ఞ అని పిలుస్తున్నారు. ఈ కామన్ పాయింట్ విషయం బయటకు రాగానే..
భలేగుంది కదా అంటూ అభిమానులు ఖుష్ అవుతున్నారు. మోక్షజ్ఞ తారకరామ తేజ సినిమా ఎంట్రీ అంతా ఓకే అని అనుకోవడం అయితే అవుతోంది కానీ ముందుకెళ్లడం లేదు. అయితే ‘ఆదిత్య 999 మ్యాక్స్’తో మోక్షజ్ఞ ఎంట్రీ ఉంటుందని ఇటీవల తెలిసింది. వచ్చే ఏడాదిలో ఈ సినిమా ప్రారంభం అవుతుందట. ప్రస్తుతం దాని కోసం బాలయ్య ముహూర్తాలు చూస్తున్నారట.